Ads
చాలా వరకూ సినిమాల్లో చూపించే ఇది నిజం కాదు. అంతేకాకుండా కొన్నిసార్లు తెర మీద ఒకటి ఉంటే తెర వెనకాల మరొకటి జరుగుతుంది.
Video Advertisement
ఒక్క మాటలో చెప్పాలి అంటే తెరమీద చూసిన దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది తెరవెనుక పరిస్థితి. మన్మధుడు సినిమా విషయంలో కూడా సరిగ్గా అదే జరిగింది.
మన్మధుడు సినిమా క్లైమాక్స్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. హీరోయిన్ సోనాలి బింద్రే తన పెళ్లి అని హీరోకి కార్డు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. హీరో తన ప్రేమని హీరోయిన్ కి చెప్పాలి అని హీరోయిన్ కోసం బయలుదేరుతాడు.
తర్వాత హీరోయిన్ పడవలో వెళ్లడం చూసి తనకోసం నీళ్ళల్లో దూకి ఈదడానికి ప్రయత్నిస్తాడు. హీరో నాగార్జున కి ఈత రాదు అని సినిమాలో ముందే చెప్పారు. కాబట్టి అదే విషయం గుర్తుకు వచ్చిన హీరోయిన్ హీరో కోసం నీళ్లలో దూకి వెళ్లి హీరోకి సహాయం చేస్తుంది. తర్వాత హ్యాపీ ఎండింగ్.
ఇదంతా మనం తెర మీద చూసింది. కానీ నిజానికి షూటింగ్ సమయంలో ఆ సీన్ చేసేటప్పుడు భయపడింది సోనాలి బింద్రే అట. భయం తో ఈత కొట్టడానికి సోనాలి బింద్రే ఇబ్బంది పడుతూ ఉంటే నాగార్జున సహాయం చేశారట. చూశారా? సినిమా తో పోలిస్తే నిజానికి జరిగిన సంఘటన ఎంత భిన్నంగా ఉందో?
End of Article