సక్సెస్ అయినా ప్రతి వారికి గతం ఉంటుంది. గతం లో వారు పడ్డ కష్టాల ఫలితమే వారి సక్సెస్. వారి కష్టాలను, పరిస్థితులను పట్టించుకోని సమాజం సక్సెస్ అయిన తరువాత మాత్రం వేనోళ్ళ కీర్తిస్తుంది. అయితే ఎంత పేదరికం లో ఉన్నప్పటికీ.. ప్రతిభ ఉన్న వారు తమంతట తాము పైకి రాగలుగుతారు.

feature manya singh

ఇటీవల ముంబై లో జరిగిన మిస్ ఇండియా పోటీలలో మిస్ ఇండియా వరల్డ్ 2020 గా నిలిచిన తెలంగాణ కు చెందిన అమ్మాయి మానస వారణాసి, మిస్ ఇండియా 2020 రన్నరప్ గా నిలిచిన యూపీకి చెందిన అమ్మాయి మాన్య సింగ్ లు ఈ విషయాన్నీ నిరూపించి చూపించారు. వీరిద్దరూ నిరుపేద కుటుంబం నుంచి వచ్చినవారే. తమ కష్టం తో, ప్రతిభతో నేడు సమాజం గుర్తించేలా నిలబడ్డారు.

manya singh 2

వీరిలో యూపీకి చెందిన మాన్య సింగ్ ది చాలా పేద కుటుంబం. మాన్య సింగ్ తండ్రి ఆటో డ్రైవర్ గా పని చేసేవాడు. తాజాగా ఆమె తన జీవిత ప్రయాణం గురించి ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంది. చాలీ చాలని జీతం తో తమ కుటుంబం చాలా ఇబ్బందులు పడదని మాన్య సింగ్ చెప్పుకొచ్చింది. ఆకలి బాధ తో చాలా రోజులు నిద్రలేని రాత్రులను గడిపామని ఆమె చెప్పుకొచ్చింది. అయితే, ఆర్ధిక ఇక్కట్లను తొలగించడం కోసం తానూ కొన్ని ఇళ్లలో అంట్లు తోమే పనికి కుదురుకున్నానని, అందువలన చదువుకోలేకపోయానని మాన్య సింగ్ చెప్పుకొచ్చారు.

manya singh

అయితే, తన కలలను సాకారం చేసుకోవడం కోసం తీవ్రం గా శ్రమించినట్లు ఆమె పేర్కొన్నారు. రాత్రి వేళలో కాల్ సెంటర్లలో పని చేశానని ఆమె చెప్పుకొచ్చారు. డబ్బులు లేకపోతె కొన్ని సార్లు కిలోమీటర్ల దూరం కూడా నడిచినట్లు ఆమె చెప్పుకున్నారు. ఆమె చేసిన పోస్ట్ పై పలువురు ఎమోషనల్ గా స్పందిస్తున్నారు.

టాలీవుడ్ బ్యూటీ సమంత కూడా మాన్య సింగ్ పోస్ట్ పై స్పందించారు. ఇమాజిన్, క్రియేట్, ఇన్స్పైర్ అంటూ.. మాన్య సింగ్ పోస్ట్ ను సమంత పంచుకున్నారు. వరుణ్ ధావన్, అమీ జాక్సన్ వంటి తారలు కూడా మాన్య కు అభినందలు చెబుతూ మద్దతు గా నిలుస్తున్నారు.