విద్యుత్ వినియోగదారులకు శుభవార్త…మార్చ్, ఏప్రిల్ బిల్లుల మీద విద్యుత్ శాఖ క్లారిటీ!

విద్యుత్ వినియోగదారులకు శుభవార్త…మార్చ్, ఏప్రిల్ బిల్లుల మీద విద్యుత్ శాఖ క్లారిటీ!

by Anudeep

Ads

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కొరకరాని కొయ్యగా మారిన కరోనా మహమ్మారి వలన వచ్చిన లాక్ డౌన్ కారణంగా..అటు ప్రభుత్వాలు..ఇటు ప్రజలు ఆదాయాన్ని కోల్పోతున్నారు..తిరిగి వ్యాపారాలు,ఉద్యోగాలు సాధారణ స్థితికి ఎప్ప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొన్నది.రిజర్వు బ్యాంకు వారు కూడా ఇప్పటికే మూడు నెలల మారటోరియం విధిస్తు బ్యాంకు లోన్ లకి వెసులుపుబాటు కలిపించింది…మరో మూడు నెలల పొడిగింపు ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది..

Video Advertisement

అటు విద్యుత్ శాఖ వారు కూడా ప్రజలకి ఊరటనిచ్చే వార్త …ని ఇచ్చారు..మార్చ్,ఏప్రిల్ నెలల కి సంబంధించి కరెంటు బిల్లులు కలిపి ఇస్తారని వచ్చిన వార్తల్లో కేవలం అవి అపోహలు మాత్రమేనని ఆంధ్రప్రదేశ్‌ ట్రాన్స్‌ కో సీఎండీ నాగుల శ్రీకాంత్‌ స్పష్టం చేసారు. రెండు నెలల బిల్లులు విడివిడిగా లెక్క కట్టినట్లు తెలిపారు మార్చి,ఏప్రిల్ నెలలలకి సంబందించిన బిల్లులు అదనంగా వసూలు చేసే ఆలోచన లేదని స్పష్టం చేసారు.మార్చ్, ఏప్రిల్ నెలలకు 50 శాతంగా బిల్లులు లెక్క కట్టి ఇవ్వడంతో స్లాబ్‌ మారే అవకాశం లేదని సీఎండీ శ్రీకాంత్ స్పష్టం చేశారు.

గత 5 ఏళ్లలో మార్చి నెలలో 46 శాతం.ఏప్రిల్ లో 54 శాతం విద్యుత్ వినియోగం ఉంటుందని ఏప్రిల్‌లో అధికంగా ఉన్న నాలుగు శాతాన్ని మార్చిలో వచ్చిందని స్పష్టం చేసారు.విద్యుత్ వినియోగదారుల అనుకూలంగానే బిల్లింగ్ తయారు చేశామని ఎక్కడ కూడా యూనిట్ కి కూడా అదనంగా బిల్లింగ్ చెయ్యలేదని సీఎండీ శ్రీకాంత్ స్పష్టం చేసారు.విద్యుత్ వినియోగదారులకు బిల్లుల పైన ఎటువంటి అనుమానాలు ఉన్నా 1912 డైలీ చేసి కంప్లైంట్ చెయ్యాలని తెలిపారు.ఏప్రిల్ నెల బిల్లుని విడివిడిగా SMS చేస్తామని మరీ మరీ తెలిపారు.


End of Article

You may also like