Ads
పెళ్లంటే పందిళ్లు,సందళ్లు,తప్పట్లు,తాళాల,తళంబ్రాలు మూడే ముళ్లు,ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్లు అంటూ ఒక ఫేమస్ పాట ఉంది గుర్తుందా? ఇవన్నీ జరగాలంటే ముందు పెళ్లి కార్డు కావాలి కదండీ.ఇంతకీ మీరు పెళ్లి కార్డులో ఏం రాయిస్తారు? శ్రీరస్తు,శుభమస్తూ,ఆవిగ్నమస్తూ అంటూ మొదలుపెట్టి పెళ్లికొడుకు,పెళ్లి కూతురు పేర్లు,వివాహ వేడుక తదితర వివరాలు, చివరన బంధుమిత్రుల అభినందనలతో అంటూ ముగిస్తుంది. అవునా?కాదా? కానీ ఒక జంట డిఫరెంట్ గా ఆలోచించింది.అందులో తమ హనీమూన్ గురించి కూడా మెన్షన్ చేశారు..హనీమూన్ గురించి మెన్షన్ చేయడం ఏంటని ఆశ్చర్యపోకండి. చదవండి
Video Advertisement
ఎవరైనా పెళ్లికి చెప్పాకా ఆ పెళ్లికి వెళ్లడం ,వెళ్లకపోవడం మనిష్టం.ఇక గిఫ్టుల సంగతి అంటారా అది పూర్తిగా మనపైనే డిపెండ్ అయి ఉంటుంది.అంతేకాని నా పెళ్లికి ఫలానా గిఫ్ట్ తీసుకుని రా అని ఎవరూ అడగరు. మా పెళ్లికి గిఫ్టులు స్వీకరించబడవు అని రాసిన పెళ్లి కార్డులు చూసుంటాం కాని,మా పెళ్లికి గిఫ్టులు వద్దు డబ్బులు ఇవ్వండి అనే కార్డు ఎక్కడైనా చూసారా?అది కూడా ఆ డబ్బు దేనికోసమో తెలుసా ఆ జంట హనీమూన్ కోసమట. హవ్వ ఇదెక్కడి చోద్యం అని ముక్కున వేలేసుకోకండి.
వెర్రి వేయింతలు అన్నట్టు సోషల్ మీడియా వచ్చాక ప్రతీది సెన్సేషనే అవుతుంది.జనం కూడా అంతే ఏం చేస్తే వెరైటీగా ఉంటుందా అని రకరకాలుగా ఆలోచిస్తున్నారు.అందులో కొన్నింటికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే ,మరికొన్నింటికి నెగటివ్ రెస్సాన్స్ వచ్చి అక్షింతలు పడకతప్పట్లేదు అదేనండి తిట్లు. హనీమూన్ కి డబ్బులు ఇవ్వండి అంటూ మెన్షన్ చేసిన పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అయింది,నెటిజన్లు ఆ జంటకి అక్షింతలు వేశారు.
మీరు పెళ్లి చేసుకుంటుంది గిఫ్ట్‌ల కోసమేనా అంటూ కొందరు, హనీమూన్ కోసం డబ్బులా? పెళ్లి చేసుకొమ్మని ఎవరు బలవంతపెట్టారు అంటూ మరికొందరు కామెంట్ చేసారు. ఈ పెళ్లికి నేనైతే వెళ్లను,ఇలాంటి కండిషన్స్ పెడితే వాళ్ల పెళ్లికి వాళ్లిద్దరు తప్ప ఎవరూ ఉండరు అంటూ దగ్గర ఫ్రెండ్ ఒకరు రెస్పాండ్ అయ్యారు.
మేం డబ్బులిస్తే మీరు పండుగ చేస్కుంటారా? మీరేం లవ్లీ కపుల్‌రా బాబూ మీ పెళ్లికి ఎవడూ రాడు. ఫ్రెండ్ అనే వాడెవ్వడు దీనికి ఒప్పుకోడు,మీ పెళ్లి మీరే చేస్కోండి.గిఫ్టులు ఇస్తే తీస్కోవాలి,ఇష్టం లేకపోతే వద్దనాలి కాని మరీ అడుక్కోవడం ఏంటని మండిపడుతున్నారు. అంతేకదండీ ఇలాంటి వాటికి ఎవరు మాత్రం యాక్సెప్ట్ చేస్తారు?మీరు యాక్సెప్ట్ చేస్తారా?
featured image: image used is just for reference. but not the actual characters
End of Article