పెళ్ళికి ముందు నాకోసం అంత చేసాడు.! కానీ, పెళ్లయ్యాక ఇలా అయ్యేసరికి…? నా సమస్యకి పరిష్కారం చూపండి..!

పెళ్ళికి ముందు నాకోసం అంత చేసాడు.! కానీ, పెళ్లయ్యాక ఇలా అయ్యేసరికి…? నా సమస్యకి పరిష్కారం చూపండి..!

by Mohana Priya

సాధారణంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్యలు చాలా తక్కువగా వస్తాయి అంటారు. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. తన బాధని చెప్తూ ఒక యువతి ఈ విధంగా రాసింది. నా పేరు పవిత్ర. నేను కాలేజ్ లో ఉన్నప్పుడు రాజేష్ పరిచయం అయ్యాడు. ఇద్దరం ఒకటే క్లాస్. నేను అమ్మాయి, అబ్బాయి అనే భేదం లేకుండా అందరితో ఒకే లాగా ప్రవర్తించేదాన్ని. దాంతో నాకు రాజేష్ తో పరిచయం ఏర్పడటం, అది ప్రేమగా మారడం జరగడానికి ఎక్కువ సమయం పట్టలేదు.

Video Advertisement

Marriage problem of a woman

రాజేష్ కి కొంచెం కోపం ఎక్కువ. కానీ మేమిద్దరం రిలేషన్ లోకి వెళ్లిన తర్వాత కోపం తగ్గించేసుకున్నాడు. ఆ మాట నాకు ఆనందాన్ని కలిగించింది. అలా 5 ఏళ్లు గడిచిపోయాయి. ఇద్దరికీ మంచి ఉద్యోగం వచ్చింది. ఇంక పెళ్లి చేసుకుందామని అనుకున్నాం. ముందు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ రాజేష్ మాట్లాడిన తీరు చూసి, వాళ్ల కుటుంబంతో మాట్లాడిన తర్వాత మా వాళ్ళకి కూడా రాజేష్ బాగా నచ్చాడు. అలా మా ఇద్దరి పెళ్లి జరిగిపోయింది. పెళ్లయిన కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నాం. రెండు నెలలకు ఒకసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి వస్తూ ఉండేదాన్ని.

MARRIAGE 2

మేమందరం ఒకే సిటీలో ఉంటాం. నేను చాలా ఆనందంగా ఉండటంతో మా అమ్మ, నాన్న కూడా నన్ను చూసి సంతోషపడేవాళ్ళు. నా తమ్ముడు పేరు అజయ్. అజయ్ కూడా ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. నన్ను చూసిన మా అమ్మనాన్నలు అజయ్ కూడా సంతోషంగా ఉంటాడు అనే ఉద్దేశంతో వాళ్ల ప్రేమని అంగీకరించారు. అజయ్ అమ్మాయిని మా ఇంటికి తీసుకు వస్తున్నాడు. నేను కూడా వెళ్లి ఆ అమ్మాయిని కలుద్దామని అనుకున్నాను. ఇదే విషయం రాజేష్ కి చెప్పాను. దానికి రాజేష్ చెప్పిన సమాధానంకి నాకు నోట మాట రాలేదు.

Marriage problem of a woman

“ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇలా రెండు నెలలకు ఒకసారి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లడం అవసరమా? పండగ వస్తుంది. మనం ఈసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి” అని అన్నాడు. “ఇప్పుడు వెళ్లి సాయంత్రం వరకు వచ్చేస్తాను” అని చెప్పాను. నేను చెప్తున్నా వినకుండా వాళ్ళ అమ్మ వాళ్లకి ఫోన్ చేసి, మేమిద్దరం ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం” అని చెప్పాడు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత రాజేష్ లో ఇలాంటి ప్రవర్తన చూస్తున్నాను. పండగకి మా అత్తగారి వాళ్ళ ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి వస్తాను అని అడిగాను.

Marriage problem of a woman

అందుకు కూడా రాజేష్ ఒప్పుకోలేదు. ఇద్దరికీ చాలా పెద్ద గొడవ అయింది. నన్ను కొట్టినంత పని చేశాడు. అప్పుడు నాకు అర్థమైంది రాజేష్ కి కోపం తగ్గలేదు. తగ్గినట్టు నటించాడు. తర్వాత ఎన్నోసార్లు ఈ కోపాన్ని నేను చూశాను. మా అమ్మ వాళ్లకు చెబుదామంటే వాళ్ళు బాధ పడతారు అని భయం. మా అత్తయ్య, మామయ్య నన్ను కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. నాకు సమస్య కేవలం రాజేష్ తోనే. రాజేష్ స్వతహాగా మంచివాడే అయినా కానీ, కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడో తనకే తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్దాం అన్నా రాడు. నాకు ఏం చేయాలో అర్థం అవ్వడం లేదు. ఇంకా ఎన్నిరోజులు నేను ఇవన్నీ భరించాలి?


You may also like