కరోనా నేపథ్యంలో ఓ వధూవరుల క్రియేటివిటీ…పెళ్లిపత్రికే మాస్కుగా వింత పెళ్లి.!!!

కరోనా నేపథ్యంలో ఓ వధూవరుల క్రియేటివిటీ…పెళ్లిపత్రికే మాస్కుగా వింత పెళ్లి.!!!

by Anudeep

Ads

సరిగ్గా పెళ్లిల్ల హడావిడి మొదలయ్యే ముందు కరోనా అటాక్ చేసింది..వెంటనే లాక్ డౌన్ ప్రకటణతో చేసేదేం లేక పెళ్లిల్లు పెట్టుకున్నవాళ్లు ఆగిపోక తప్పని పరిస్థితి..కొందరు ఎలాగోలా పెళ్లిల్లు చేసేసుకుంటే..మరికొందరు వాయిదా వేసుకుంటూ వచ్చారు.. ఇప్పుడు లాక్ డౌన్ సడలింపుల్లో 20మందితో పెళ్లి చేస్కోవచ్చని ప్రభుత్వం ప్రకటించగానే చాలామంది రెడీ అయిపోయారు..కానీ భౌతిక దూరం, మాస్కు తప్పని సరి..ఇదే మాస్కు విషయంలో ఒక పెళ్లిజంట విభిన్నంగా ఆలోచించింది..

Video Advertisement

పెద్దపల్లి జిల్లా తొగర్రాయిలో ఓ జంట వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైంది. కొద్దిమంది అతిథులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది.ఈ పెళ్లికి వచ్చినవారందరికీ మాస్కులు కూడా వారే స్వయంగా పంపిణీ చేశారు.. అక్కడే ఉంది స్పెషల్ వీరు పంపిణి చేసిన  మాస్కులపై వధూవరుల ఫొటోలు, పెళ్లి వివరాలు ముద్రించారు. ఏకంగా పెళ్లిపత్రికనే మాస్కుపైకి ఎక్కించారన్నమాట.

ఈ పెళ్లికి వచ్చిన అందరి ముఖాలకు ఇవే మాస్కులు ఉండడంతో అందరిని ఆకట్టుకుంది. వధూవరులు, పురోహితుడు సైతం ఈ మాస్కులనే ధరించారు. పెళ్లింటి వారి చేసిన ఈ డిఫరెంట్ మాస్కుల ఏర్పాటుని గ్రామస్తులు, బంధువులు అభినందనలతో ముంచెత్తారు.. ఆ నోట ఈ నోట ఈ విషయం అధికారుల వరకు తెలియడంతో పెళ్లి వారు చేసిన పనికి వారు కూడా హర్షం వ్యక్తం చేశారు..

ఈ డిఫరెంట్ పెళ్లి మాస్కులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి..దీనిపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నరు..కరోనాతో సహజీవనం చేయాల్సిందే అని ఫిక్సయ్యాక మాస్కులు,శానిటైజర్లు మన జీవితంలో భాగం కావాల్సిందే అని మనుషులందరూ గుర్తిస్తున్నారు అనడానికి ఇదే చక్కటి ఉదాహరణ.


End of Article

You may also like