Ads
కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి, మాస్కులు మన జీవితం లో భాగం అయ్యాయి. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ ను పాటించడం ద్వారా మనం కరోనా పై యుద్ధాన్ని చేస్తున్నాం. అయితే, లాక్ డౌన్ తరువాత అన్ని షాపింగ్ మాల్స్, స్టోర్స్ తెరుచుకున్నాయి. అందరు మాస్కును ధరించడం తప్పనిసరి చేస్తున్నారు. హోటల్స్ కి వెళ్లాలన్న, షాపింగ్ మాల్స్ లో షాపింగ్ చేయాలన్న మాస్క్ ని ధరించడం మాత్రం తప్పనిసరి. ఈ క్రమం లో హైదరాబాద్ లో ని ఓ షాపింగ్ స్టోర్ మాస్కుల వాడకం ప్రోత్సహించడానికి వినూత్నం గా ప్రయత్నించింది.
Video Advertisement
నగరం లోని ప్రముఖ స్టోర్ మక్దూమ్ బ్రదర్స్ మాస్క్ మహారాజా తో ముందుకొచ్చింది. ఈ స్టోర్ కు 132 సంవత్సరాల నాటి సుదీర్ఘ చరిత్ర ఉంది. తాజాగా, ఈ స్టోర్ బయట 10 అడుగుల బొమ్మను ఏర్పాటు చేసారు. ఈ బొమ్మ కు ఫేస్ మాస్క్ లతో కుట్టబడిన సూటు ను వేశారు. ఇందుకోసం మొత్తం 250 మెడికల్ మాస్క్‌లను వినియోగించారు. మక్డూమ్ బ్రదర్స్ తయారుచేయించి న ఈ సూట్ ప్రపంచంలోనే ఎత్తైన బొమ్మగా రికార్డు సృష్టించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ ధరించి ఎవరికీ వారు రక్షణ పొందడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని స్టోర్ యజమానులలో ఒకరైన ఫైజ్ మొహియుద్దీన్ చెబుతుంటారు.
హైదరాబాద్ ను పాలించిన నిజాం రాజులకు మక్దూమ్ బ్రదర్స్ అందించారు. భారత్ కు వచ్చిన నాయకులకు వారి బ్రాండ్ దుస్తుల్ని అందిస్తూ.. ఈ బ్రాండ్ ను ప్రపంచానికే పరిచయం చేసారు. ఇంకా ఇతర ప్రముఖులకు, క్రికెటర్లకు, షేర్వాణీలకు కూడా మక్దూమ్ బ్రదర్స్ వారి బ్రాండ్ దుస్తులను అందించారు. తాజాగా, ఈ మాస్క్ మహారాజా సూట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. పలు చిన్న వ్యాపారాలు సైతం ఈ సూట్ గురించి హర్షిస్తున్నారు. కనికరం లేని కరోనా పై పోరాటం చేయడానికి ఉన్న ఏకైక ఆయుధం మాస్క్ అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం ఈ స్టోర్ ని మక్దూమ్ బ్రదర్స్ నాలుగవ తరం నడుపుతోంది. వీరు కూడా సామజిక అంశాలపై బాధ్యతాయుతం గా స్పందిస్తున్నారు.
లాక్ డౌన్ కారణం గా వీరి దుకాణం లో కూడా వ్యాపారం మందగించింది. ఆంక్షలు ఎత్తివేసిన తరువాత ఈ మధ్యే తిరిగి పుంజుకుంటోందనిఫైజ్ మొహియుద్దీన్ తెలిపారు. రెండో వేవ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్న నేపధ్యం లో పెద్ద సైజు లో ఉండే మాస్క్ ధరించి రావాలని కోరుతున్నట్లు తెలిపారు. అలాగే, కస్టమర్లలో మాస్క్ ధరించే అలవాటు ను పెంపొందించడం కోసం, మాస్క్ లు ధరించి వచ్చే కస్టమర్ల ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నట్లు ఫైజ్ మొహియుద్దీన్ తెలిపారు.
watch video:
End of Article