మాస్క్ వేసుకొని చేయకూడని పనులు ఇవే…ఈ జాగ్రత్తలు పాటించకుంటే కొత్త రోగాలొస్తాయి!

మాస్క్ వేసుకొని చేయకూడని పనులు ఇవే…ఈ జాగ్రత్తలు పాటించకుంటే కొత్త రోగాలొస్తాయి!

by Anudeep

Ads

కరోనా దెబ్బతో ఒక్కసారిగా మాస్కులకు, శానిటైజర్లకు గిరాకి బాగా పెరిగిపోయింది.మాస్కులు వాడుతున్న వందమందిలో సుమారు తొంభై మందికి ఆ మాస్కులను వాడే విధానం తెలియదని కచ్చితంగా చెప్పగలను..ఇదేదో మిమ్మల్ని అవమానించడానికి కాదండీ.. మాస్కులు వాడాలి, మాస్కులు వాడాలి అనే హడావిడియే తప్ప, అసలు మనం వాడే విధానం సరైనదేనా కాదా అని ఆలోచించేవాళ్లు తక్కువ… మాస్కు యూజ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుని ఇక నుండైనా జాగ్రత్తగా ఉంటారనే.. ఈ ఆర్డర్ లాంటి రిక్వెస్ట్..

Video Advertisement

మాస్క్ లేకపోతే వెయ్యి రూపాయల ఫైన్ అని ప్రభుత్వాలు ప్రకటించాయి.. ఆ వెయ్యి ఫైన్ కట్టడం కష్టం అనైనా మాస్క్ పెట్టుకుంటారు..మాస్కు పెట్టుకునే బయటికి వెళ్తారు..బయటకి వెళ్లాక ఏ పని మీద వెళ్లామో అక్కడ ఏదైనా ముట్టుకోకతప్పదు..అదే చేత్తో మళ్లీ మాస్కుని పట్టుకుంటారు..ఇంక మాస్కు పెట్టుకుని ఉపయోగం ఏంటి..మాస్కు పెట్టుకునే ముందైనా, తీసే ముందైనా కేవలం హ్యాండిల్స్ మాత్రమే పట్టుకోవాలి.. చేతులతో మాస్కులపై తడమడం లాంటివి చేయకూడదు..

కొందరుంటారు.. వాడిన మాస్కునే వాడుతూ ఉంటారు.. నిజానికి మీరు వాడే మాస్కు కాల వ్యవధి కేవలం మూడు నుండి నాలుగు గంటలు..అలాంటప్పుడు మనం రోజంతా మాస్కు వాడాలంటే మన దగ్గర మూడు నుండి నాలుగు మాస్కులైనా ఉండాలి..వాడిన వాటిని తీసి జాగ్రత్తగా డిస్పోజ్ చేయాలి..మరికొందరుంటారు మాస్కులను వాడినంత సేపు వాడి వెంటనే తీసి జేబులో పెట్టుకోవడమో, బ్యాగ్ లో పడేయడమో చేస్తుంటారు.మళ్లీ అవసరం వస్తే అదే మాస్క్ తీసి వాడేస్తుంటారు.. ఇలా చేయడం వల్ల ఉపయోగం ఉండదు సరికదా, మీరే స్వయంగా అనారోగ్యాన్ని ఆహ్వానిస్తున్నట్టు.. ఆలోచించుకోండి.

ఈ మధ్య చాలామంది మాస్క్ అనగానే మనం తయారు చేసుకోలేమా అని క్లాతులతో తయారు చేసేసుకుంటున్నారు..నిజానికి మాస్క్ అనేది వైధ్యపరిమాణాలకు అనుగుణంగా తయారు చేస్తారు.అంటే ఎలా అయితే బ్యాక్టిరియా , వైరస్లు అటాక్ చేయకుండా ఉండాలనో, అదేవిధంగా మనకి గాలి కూడా ఆడేవిధంగా వాటి రూపకల్పన ఉంటుంది. అదే మనం ఏ క్లాత్ తో పడితే ఆ క్లాత్ తో మాస్క్ తయారు చేసుకుని వాడేస్తూ ఉంటే కొత్త అనారోగ్య సమస్యలు రావొచ్చు.

సరే, ఏదో ఒకటి క్లాత్ ముక్కుకి, నోటికి అడ్డుపెట్టుకోవడమే కదా అనుకుంటే..తెలుసుకోవాల్సిన మరో ముఖ్య విషయం ఏంటంటే.. ఉచ్వాసనిశ్వాసలప్పుడు ఆక్సిజన్ పీల్చుకోవడం, కార్బన్ డయాక్సైడ్ వదలడం లాంటివి జరుగుతాయి అనే విషయం అందరికి తెలిసిందే.. ఈ మాస్కు వాడడం వలన మనం వదిలిన గాలిని మనం యాజ్ ఇట్ ఈజ్ గా పీల్చేస్తుంటాం..అంటే మనం వదిలిన కార్బన్ డయాక్సైడ్ ని మనమే మళ్లీ మన శరీరంలోకి పీల్చేస్తుంటాం అన్నమాట..దానివలన కొత్త అనారోగ్య సమస్యలు వస్తుంటాయి..అలా జరగకుండా ఉండాలంటే మాస్కుని కంటిన్యూస్ గా వాడేవాళ్లు కొంచెం గ్యాప్ ఇస్తూ మాస్కుని తీసి బయట ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటూ ఉండాలి.

అసలు విషయానికి వద్దాం.. గాలి పీల్చుకుంటే కరోనా వస్తుంది కదా అనేది చాలామంది వాదన..కానీ కరోనా వైరస్ గాలిలో బతకలేదు..కాబట్టి భయం అక్కర్లేదు..మన ముందు ఎవరైనా వ్యక్తి ఉన్నప్పుడు మాస్క్ తీసి గాలి పీల్చి పెట్టుకోవడం లాంటి పనులు చేయకుండా , ఎవరూ లేనప్పుడు మనం మాత్రమే ఉన్నామనుకున్న చోట మాస్కుని తీసి గాలిపీల్చి మళ్లీ పెట్టుకోవచ్చు..


End of Article

You may also like