మాస్కులు అమ్మి 3 లక్షలు సంపాదించారు…ఆ డబ్బుని ఏం చేసారో తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు!

మాస్కులు అమ్మి 3 లక్షలు సంపాదించారు…ఆ డబ్బుని ఏం చేసారో తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు!

by Anudeep

Ads

కోవిడ్ -19 వ్యాప్తి కారణంగా అందరి రోజువారి పనులు ఆగిపోయాయి..ముఖ్యంగా చిన్నపిల్లలే ఎక్కువగా కరోనా బారినపడే అవకాశం ఉండడంతో ఎప్పటి నుండో స్కూళ్లకి సెలవులు ఇవ్వడమే కాకుండా.. పాఠశాలల పున:ప్రారంభంపై ప్రభుత్వాలు తర్జనభర్జనలు పడుతున్నాయి.. అయితే ఇప్పటికే కొన్ని స్కూల్స్ ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేసాయి..కానీ అందరు విద్యార్దులకు ఆన్లైన్ క్లాసెస్ కి అటెండ్ అయ్యే వెసలుబాటు ఉంటుందని చెప్పలేం.. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకునే విద్యార్దులకు స్మార్ట్ ఫోన్స్ పంపిణి చేయాలని చూస్తుంది కేరళలోని ఒక గ్రామ పంచాయితి.

Video Advertisement

కరోనాని ధీటుగా ఎదుర్కొన్న రాష్ట్రంగా కేరళ యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది..తొలికేసు నమోదు అయిన నాటి నుండి ఇప్పటివరకు ధైర్యంగా ఎదుర్కోవడమే కాదు..ప్రజల అవసరాలకు తగ్గట్టుగా నడుస్తోన్న ప్రభుత్వం ఏదన్నా ఉందా అంటేఅది కేరళ మాత్రమే..కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు..కేరళవాసులు కూడా అంతే విభిన్న ఆలోచనలతో ప్రజల అవసరాలు తీరుస్తున్నారు…ఇప్పుడు ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యే విద్యార్దులకు స్మార్ట్ ఫోన్స్ పంపిణి చేయాలని చూస్తున్నారు అలప్పుజలోని కుంజికోజి గ్రామ వాస్తవ్యులు.

స్మార్ట్ ఫోన్స్ కొనడానికి డబ్బులు ఎక్కడివి? అంటే కోవిడ్ -19వ్యాప్తిని అరికట్టడానికి గ్రామస్తులంతా కలిసి 1,11,000 మాస్కులను కుట్టి వాటిని విక్రయించారు..అలా మాస్కులు అమ్మగా వచ్చిన డబ్బు మొత్తం 3లక్షల రూపాయలు..ఆ 3లక్షల రూపాయలని తిరిగి గ్రామానికే వినియోగించాలనుకునే క్రమంలో వచ్చిన ఆలోచనే స్మార్ట్ ఫోన్స్ పంపిణి..ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన కొంతమంది పేద విద్యార్దుల పేర్లను లిస్టుగా తయారుచేసుకున్నారు.

వారందరికి జూన్ మొదటి వారంలో స్మార్ట్ ఫోన్స్ ని పంపిణి చేయనున్నారు.. వారిలో రెండవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదివే విద్యార్దులున్నారు..ఈ స్మార్ట్ ఫోన్ ఖరీదు ధర ఒకటి 3000-3500 రూ. ఉండే విధంగా చూసుకుని 150మందికి స్మార్ట్ ఫోన్స్ పంపిణి చేయాలని అనుకుంటున్నట్టు ఆ గ్రామ పంచాయితి కార్యదర్శి  రాజు అన్నారు.. మరింత మందికి స్మార్ట్ ఫోన్స్ అందేలా చూస్తాం అని ..అంతేకాదు ఇంటర్నెట్ సౌకర్యం లేనివారికి ఫ్రీ ఇంటర్నెట్ అందించేందుకు కూడ ఏర్పాట్లు చేస్తున్నారు.


End of Article

You may also like