“మాతృ దేవో భవ” సినిమాలోని ఈ చిన్నారులు ఇప్పుడు ఏమి చేస్తున్నారో తెలుసా..?

“మాతృ దేవో భవ” సినిమాలోని ఈ చిన్నారులు ఇప్పుడు ఏమి చేస్తున్నారో తెలుసా..?

by Anudeep

Ads

అమ్మతనాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ, కన్నీళ్లు పెట్టించిన “మాతృ దేవో భవ”. ఈ సినిమా పేరు వింటేనే కన్నీళ్లు వచ్చేస్తాయి. తండ్రి బాధ్యతలు తీసుకోకపోతే.. పిల్లలని పెంచడానికి తల్లి పడే వ్యధ ని కళ్ళకు కట్టినట్లు చూపించే తీరు అద్భుతం గా ఉంటుంది. అమ్మతనం అంటేనే ప్రత్యేకం.. ఆ ప్రత్యేకతను నిలువునా ఆపాదించుకున్న సినిమా “మాతృ దేవో భవ”..

Video Advertisement

ఈ సినిమాలో తల్లి గా మాధవీలత నటనాతీరు మరిచిపోలేనిది. ఈ సినిమా వచ్చి ఇప్పటికి దాదాపు పాతికేళ్ళు పైనే కావొస్తోంది. అయినా.. ఇప్పటికి కన్నీళ్లు పెట్టిస్తుంది. ఈ సినిమా లోని పాటలు కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో తల్లి గా మాధవీలత, తండ్రి గా నాజర్ నటించారు. ఇద్దరు వారి పాత్రలకి వందశాతం న్యాయం చేకూర్చారు. వీళ్ళ పిల్లలుగా నటించిన మాస్టర్ మార్టిన్, బేబీ సీన, మాస్టర్ ఫణి, మాస్టర్ తేజ లు కూడా అద్భుతం గా నటనతో ఆకట్టుకున్నారు.

baby seena

ఈ సినిమాలో బేబీ సీన రాధా పాత్రలో నటించారు. ఈ అమ్మాయి తమిళం లో అనేక సీరియల్స్ లో నటించింది. నటి గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. తెలుగు లో హిట్లర్ సినిమాను తమిళ్ లో కూడా రీమేక్ చేసారు. అందులో సీనా ముమ్ముట్టి చెల్లెలిగా నటించి అదరగొట్టారు. జాన్ అనే వ్యక్తిని సీన వివాహం చేసుకుని లైఫ్ లో కూడా సెటిల్ అయిపోయారు.

martin

ఈ సినిమాలో ఓ కుర్రాడు చివరివరకు తల్లిని విడవకుండా ఉంటాడు గుర్తుందా..? ఆ పిల్లాడు కూడా ఇప్పుడు పెద్దవాడై ఒకింటివాడయ్యాడు. ఆ కుర్రాడే మాస్టర్ మార్టిన్. అపుడు మూడవ తరగతి చదువుతున్న మార్టిన్ చదువు వైపుకు మరలిపోయాడు. ఈ సినిమా తరువాత ఇంకేమి చేయలేదు. మద్రాసు లయోలా లో ఇంజనీరింగ్ చదివి సెటిల్ అయిపోయాడు. 2017 లో పెళ్లి చేసుకున్నాడు. చూడ్డానికి హీరోలా ఉంటాడు. కానీ, సినిమాల పట్ల ఆసక్తి లేకపోవడం తో ఇంజనీర్ గా సెటిల్ అయిపోయాడు.


End of Article

You may also like