కత్తెర కూడా లేదు… పుట్టగానే బేబీ కలర్ మారిపోయింది..! కానీ కదిలే ట్రైన్ లో డెలివరీ ఎలా చేశారంటే..?

కత్తెర కూడా లేదు… పుట్టగానే బేబీ కలర్ మారిపోయింది..! కానీ కదిలే ట్రైన్ లో డెలివరీ ఎలా చేశారంటే..?

by Anudeep

Ads

సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్న దురంతో రైలు పట్టాల నుంచి పరుగులు మొదలుపెట్టింది. కాలానికి ఎదురీదుతున్నట్లు వేగంగా పరుగు తీస్తోంది. ఇంతలో తెల్లవారుతోంది. అప్పుడప్పుడే చీకటిని చీల్చుకుంటూ సూర్యుడు బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు.

Video Advertisement

ఇంతలో రైలులో సత్యవతి అనే ఓ గర్భిణికి పురిటి నొప్పులు మొదలయ్యాయి.విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పొన్నాంకు చెందిన పి.సత్యవతి.. భర్త సత్యనారాయణతో కలిసి బీ–6 ఏసీ బోగీలో ప్రయాణిస్తున్నారు. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్న సత్యనారాయణ భార్యను డెలివరీ నిమిత్తం స్వగ్రామానికి తీసుకెళుతున్నారు.

mbbs students done delivery in train

సోమవారం సాయంత్రం సికింద్రాబాద్‌ స్టేషన్‌లో రైలెక్కారు. అయితే మంగళవారం వేకువజామున రైలు రాజమండ్రి స్టేషన్‌ దాటుతుండగా తెల్లవారుజామున 3.35 గంటలకు సత్యవతికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆమె భర్తతో సహా అక్కడున్న వారంతా కనిపించిన వాళ్లని సాయమడిగారు. సత్యనారాయణ టికెట్‌ కలెక్టర్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన అనకాపల్లిలో రైలు ఆపేందుకు చర్యలు చేపట్టారు. ఇంతలో నొప్పులు మరింత పెరిగాయి. ఇంతలో అదే బోగీలో ప్రయాణిస్తున్న హౌస్‌సర్జన్‌ స్వాతిరెడ్డి సాహసం చేసింది.

mbbs students done delivery in train
సరిగ్గా దేవుడే పంపించాడనిపించేలా.. విశాఖపట్నం గీతం వైద్య కళాశాల విద్యార్థిని స్వాతిరెడ్డి స్పందించి సత్యవతిని పరీక్షించారు. తోటి మహిళల సాయంతో పురుడు పోశారు. కేవలం 15 నిమిషాల్లోనే నార్మల్‌ డెలివరీ చేశారు.అప్పటికే పక్క స్టేషన్ లో 108 వాహనానికి సమాచారం అందించారు. సత్యవతికి పండంటి ఆడబిడ్డ జన్మించింది. తల్లి బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఈలోగా రైలు అనకాపల్లి రైల్వేస్టేషన్‌ చేరుకుంది. 108లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.

mbbs students done delivery in train
సత్యవతి, సత్యనారాయణలది విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పొన్నం గ్రామం. స్వగ్రామానికి వెళ్తుండగా మంగళవారం తెల్లవారుజామున రాజమహేంద్రవరం దాటగానే కాన్పు అయింది. దురంతో ఎక్స్‌ప్రెస్‌కు విశాఖ వెళ్లేదాకా ఎక్కడా హాల్ట్‌ లేదు. దీంతో అందరు భయపడ్డారు. కానీ ఆ తల్లి బిడ్డల టైం బాగుండడంతో.. స్వాతి రెడ్డి అదే ట్రైన్ లో ప్రయాణించారు.

వైద్య పరికరాలు ఏవి అందుబాటులో లేకపోయినా హౌస్ సర్జన్ స్వాతి ధైర్యం చేసి తల్లి బిడ్డలను రక్షించింది. గీతం కాలేజీ యాజమాన్యం కూడా డాక్టర్ స్వాతి రెడ్డిని అభినందించింది. అనుకోకుండా రైలులో చేసిన ప్రసవం గురించి డాక్టర్ స్వాతిరెడ్డి మాట్లాడుతూ.. ఇదో అద్భుతమైన అనుభవంగా అనిపించిందని..తాను ఇప్పటిదాకా నా తోటి డాక్టర్లు..వైద్య సిబ్బంది సహాయంతో డెలివరీలు చేశాను..కానీ మొదటిసారి ఒంటరిగా.. కనీసం ఎటువంటి పరికరాలు లేకుండా చేసిన మొదటి డెలివరీ చేశానని ఈ అనుభవాన్ని తన జీవితంలో మరిచిపోలేనని అన్నారు.


End of Article

You may also like