ఏ తండ్రి అయినా తమ పిల్లలలు కష్ట పడి ఉన్నత స్థాయికి రావాలి అని అనుకుంటారు..ఆలాగే తీర్చి దిద్దుతారు కూడా అడ్డ దారిలో ఎదగాలని ఎవ్వరు అనుకోరు కదా అలాంటిది ఒక డాక్టర్ స్థాయి లో ఉండి సొంత కూతురి మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ కార్డు కాల్ లెటర్ ని ఫోర్జరీ చేసిన సంఘటన ఒకటి తమిళనాడు లోని రామనాథపురం జిల్లా లోని పరమకుడి లో వెలుగులోకి వచ్చింది.

Video Advertisement

బాలచంద్రన్ అనే డెంటిస్ట్ కూతరు ఎంబీబీస్ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం వచ్చిన కాల్ లెటర్ మర్క్స్ షీట్ లో 610 మార్కులు సాధించినట్టు గా ఫోర్జరీ చేసి చూపించుకున్నారు.మెడికల్ అడ్మీషన్ లోని అధికారులు వీటిని పరిశీలించగా ఫోర్జరీ చేసినట్టుగా బయటపడింది.తీరా చూస్తే ఆ అమ్మాయి సాధించింది కేవలం 27 మార్కులే ఫోర్జరీ చేసిన డెంటిస్ట్ మీద కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.2019 లో తమిళనాడులో నీట్ పరీక్ష లో ఒక స్కాం లో సుమారు 9 విద్యార్థులు అరెస్ట్ అయ్యారు పరీక్ష రాసేందుకు గాను తాము రాయకుండా వేరే వారిని పెట్టి మరి వ్రాయించారు.