Ads
మీనాక్షి చౌదరి ఇచ్చట వాహనాలు నిలపరాదు అనే మూవీ తోటి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మూవీ సరిగ్గా ఆడకపోయినా కూడా అమ్మడికి మంచి గుర్తింపు తీసుకువచ్చింది. తర్వాత రవితేజ సరసన ఖిలాడి మూవీలో నటించింది.ఈ మూవీ ఫ్లాప్ అయినా కూడా మీనాక్షి అందాలకు అభిమానులు ముగ్ధులు అయ్యారు. తర్వాత అడివి శేష్ తోన్నటించిన హిట్ 2 సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే మీనాక్షికి తెలుగులో వరుస పెట్టి ఆఫర్లు రావడం మొదలైంది.
Video Advertisement
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. ఈ మూవీ మొదలైన దగ్గర నుండి షూటింగ్ చాలా సార్లు వాయిదా పడడం, మూవీ నుండి హీరోయిన్ తప్పుకోవడం వంటివి జరిగిన తరువాత శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని, సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో మీనాక్షి సెకండ్ హీరోయిన్ గా నటించారు.
అయితే రీసెంట్ గా విడుదలైన గుంటూరు కారంలో త్రివిక్రమ్ మార్క్ కనిపించట్లేదు అని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఈ గుంటూరు కారం సినిమాలోనే తీసుకుంటే రాజీ అనే మరదలు క్యారెక్టర్ లో మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. కానీ తిప్పి కొడితే మూడు సీన్లు కూడా తనతో తీయించలేదు. అసలు సినిమాలో మీనాక్షి ఎందుకు ఉందో కూడా తెలీదు. కేవలం మహేష్ బాబు కి భుజం పట్టడం, ఆమ్లెట్లు వేయడానికి తప్ప ఆ క్యారెక్టర్ కి ఏ ఉపయోగమూ లేదు.
ఇది ఇలా ఉండగా… గూంటూరు కారం సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు మీనాక్షి చౌదరి. “సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో నటించే అవకాశం వచ్చిందని తెలియగానే నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొదటిరోజు మొదటి షాట్ కూడా ఆయనతోనే.. నేను చాలా టెన్షన్ పడ్డాను. నా భయాన్ని గమనించి.. టెన్షన్ పడొద్దనీ, కావాలంటే ఇంకొంత టైమ్ తీసుకోమని మహేశ్ ధైర్యం చెప్పారు. అయితే తన కోసం తాను కొన్ని నియమాలు పెట్టుకున్నానని, అందులో ముఖ్యమైంది తన ‘కంఫర్ట్’ అని చెప్పుకొచ్చింది. భాష ఏదైనా కానీ మంచి సినిమాలు చేయాలని నా కోరిక.. అందుకోసమే ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నా.. డబ్బు కంటే ముఖ్యంగా నేను చేసే పనికి ప్రశంసలతో పాటు గౌరవం దక్కాలని కోరుకుంటున్నా. స్క్రిప్ట్ ఏమాత్రం అసౌకర్యంగా అనిపించినా కానీ ముందే చెప్పేస్తానని, ఈకారణంగా నేను పెద్ద పెద్ద ప్రాజెక్టులను కూడా వదిలేసుకున్నాని తెలిపింది. తెరపై ముద్దులకు సంబంధించి కూడా కొన్ని నియమాలు పాటిస్తానని, స్క్రిప్ట్ డిమాండ్‌ను బట్టి అసభ్యకరంగా లేకుంటే వాటిని చేయడానికి నేనూ సిద్ధమే” అని చెప్పుకొచ్చారు మీనాక్షి.
End of Article