Ads
సుశాంత్ హీరోగా నటించిన ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి. మీనాక్షి సినిమాల్లోకి రాకముందు మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టారు. ఇచట వాహనములు నిలుపరాదు సినిమా మంచి టాక్ సంపాదించుకుంది. ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన ఖిలాడీ సినిమాలో నటించారు మీనాక్షి చౌదరి. అడవి శేష్ హీరోగా నటించిన హిట్ 2, మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాల్లో కూడా మీనాక్షి చౌదరి నటించారు.
Video Advertisement
ఇప్పుడు తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న గోట్, దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లక్కీ భాస్కర్, వరుణ్ తేజ్ నటిస్తున్న మట్కా, విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇంకా కొన్ని తమిళ్ సినిమాల్లో కూడా మీనాక్షి చౌదరి నటించారు. ఇప్పుడు మీనాక్షి చౌదరి మరొక సినిమా సైన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అది కూడా ఒక సీనియర్ హీరో పక్కన నటిస్తున్నట్టు సమాచారం. అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ కి గుర్తింపు పొందిన డైరెక్టర్. అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా వెంకటేష్ తో ప్రకటించారు. ఉగాది రోజు ఈ సినిమా ప్రకటన చేశారు.
ఈ సినిమా ఒక వ్యక్తి, అతని భార్య, అతని మాజీ ప్రేయసికి మధ్యలో జరుగుతుంది అని స్టోరీ లైన్ కూడా అనౌన్స్మెంట్ వీడియోలో ప్రకటించారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. అయితే స్టోరీ లైన్ చెప్పిన దాని ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు. మరి ఎవరి పాత్రలో మీనాక్షి చౌదరి నటిస్తారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమాకి సంక్రాంతి వస్తున్నాం అనే టైటిల్ అనుకుంటున్నారు అనే వార్త ప్రచారంలో ఉంది. ఇటీవల వచ్చిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. కానీ మీనాక్షి చౌదరికి 27 సంవత్సరాలు. వెంకటేష్ కి 63 సంవత్సరాలు.
దాంతో వాళ్ళిద్దరి కాంబినేషన్ తెరమీద చూడడానికి బాగుంటుందా అనే ఆలోచన అందరిలో నెలకొంది. తండ్రి, కూతుర్ల వయసు ఉన్నవాళ్లు కపుల్ గా ఎలా నటిస్తారు అని అంటున్నారు. హిందీలో అజయ్ దేవగన్ హీరోగా నటించిన దే దే ప్యార్ దే సినిమాలో కూడా ఇదే కాన్సెప్ట్ ని చూపించారు. హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. హీరోకి, హీరోయిన్ కి మధ్య చాలా వయసు తేడా ఉంటుంది. కానీ వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. దాంతోనే కథ నడుస్తుంది. కాబట్టి ఈ సినిమాలో కూడా అలాంటివి ఏమైనా చూపిస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ALSO READ : మొదటి సినిమా అట్టర్ ఫ్లాప్… 7 ఏళ్ల బ్రేక్… ఇప్పుడు దేశం గర్వించదగ్గ హీరో అయ్యాడు..! ఎవరో తెలుసా..?
End of Article