భర్తని వదిలేసి ఫోటోగ్రాఫర్ తో ఎఫైర్.. పెళ్లి చేసుకోవాలని బెదిరించేసరికి.. అసలేం జరిగిందంటే?

భర్తని వదిలేసి ఫోటోగ్రాఫర్ తో ఎఫైర్.. పెళ్లి చేసుకోవాలని బెదిరించేసరికి.. అసలేం జరిగిందంటే?

by Anudeep

Ads

హైదరాబాద్ లో మీర్ పేట్ లో జరిగిన ఫోటో గ్రాఫర్ హత్య కేసులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఓ మహిళను, ఆమెకు సహకరించిన మరో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసారు. ఆమె ఫోటో గ్రాఫర్ తనను న్యూడ్ ఫొటోలతో బెదిరించాడని, అందుకే హత్య చేసానని అంగీకరించింది.

Video Advertisement

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాగ్ అంబ‌ర్ పేట ప్రాంతానికి చెందిన యశ్విన్‌ కుమార్‌ కు శ్వేతారెడ్డితో 2018 లో పరిచయం ఏర్పడింది. వీరిద్దరికి ఫేస్ బుక్ లోనే పరిచయం అయింది.

meer pet

అప్పటికే శ్వేతకు వివాహమైంది. అయితే వీరి పరిచయం వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరి పరిచయం ఆకర్షణగా మారి వారిద్దరి మధ్య సాన్నిహిత్యం చాలా దూరం వరకు వెళ్ళింది. అప్పటికే వివాహం అయినప్పటికీ, శ్వేతా రెడ్డి ఫోటో గ్రాఫర్ తో సాన్నిహిత్యంగా మెలిగారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య న్యూడ్ వీడియో కాలింగ్ కొనసాగింది.

meer pet 1

ఈ క్రమంలో యశ్వంత్ కుమార్ తనను పెళ్లి చేసుకోవాలంటూ శ్వేతా రెడ్డి పై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే… ఆమె ఒప్పుకోకపోయేసరికి న్యూడ్ ఫొటోస్ ను చూపించి తమ మధ్య ఉన్న వివాహేతర సంబంధాన్ని బయటపెడతానని బెదిరించాడు. దీనితో అతని వేధింపులు భరించలేకే ఆమె తన ప్రియుడు, మరో ఇద్దరి సాయంతో కలిసి అతనిని హత్య చేయించినట్లు ఒప్పుకుంది. దీనితో రాచకొండ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.


End of Article

You may also like