పూజా హెగ్డేకు మెగా ఆఫర్.. హీరో ఎవరంటే..?

పూజా హెగ్డేకు మెగా ఆఫర్.. హీరో ఎవరంటే..?

by kavitha

Ads

సినీ రంగం అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ ఏది శాశ్వతంగా ఉండదు. ఈ ఇండస్ట్రీలో ఒకరు ఓవర్ నైట్ స్టార్ కావచ్చు. అలాగే ఒక్కసారిగా కింద పడిపోవడం కూడా జరుగవచ్చు. అలాంటి పరిస్థితిలోనే స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే ఉన్నట్టు తెలుస్తోంది.

Video Advertisement

ఒకప్పుడు లక్కీ హీరోయిన్ గా పేరుపొందిన పూజ హెగ్డే ఇటీవల సూపర్ స్టార్ మహేశ్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  సినిమాల నుండి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ఒక యంగ్ టాలీవుడ్ హీరోతో కలిసి నటించేందుకు పూజా హెగ్డే అంగీకరించిందని వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
పూజాహెగ్డే ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ తర్వాత వరుసగా సినిమాల ఆఫర్లు రావడంతో స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా నటిస్తూ పూజాహెగ్డే వరుసగా హిట్లను అందుకుంది. ఇక డైరెక్టర్లకు కూడా పూజాహెగ్డే  లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. అలా మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. అలాగే బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ వస్తోంది.
అయితే టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. పూజాహెగ్డే నటించిన 5 సినిమాలు వరుసగా డిజాస్టర్లు అయ్యాయి.  దాంతో కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజాహెగ్డే ను తీసుకున్నారు. కొంత షూటింగ్ కూడా జరిగిన తరువాత ఆమె ఆ మూవీ నుండి తప్పుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుండి పూజాహెగ్డే తప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
ఈ క్రమంలో పూజాహెగ్డే ఒక యంగ్  హీరోతో నటించడానికి రెడీ అయినట్లు సమాచారం. ‘విరూపాక్ష’మూవీతో విజయం సాధించిన మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో పూజహెగ్డే నటిస్తోందని తెలిసింది. ఈ మూవీని డైరెక్టర్ సంపత్ నంది తెరకెక్కించనున్నారు. దర్శక నిర్మాతలు ఈ మూవీ కోసం ఇప్పటికే పూజాహెగ్డేను సంప్రదించారని, పూజా ఒకే చెప్పిందని టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికార ప్రకటన త్వరలో వస్తుందని సమాచారం.

Also Read: వైష్ణవి చైతన్య “బేబీ” సెన్సార్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?


End of Article

You may also like