Ads
పాలిటిక్స్ నుంచి పూర్తిగా సినిమాల వైపు ద్రుష్టి సారించిన మెగాస్టార్ చిరంజీవి గారు వరుసపెట్టి మరీ కొత్త చిత్రాలు తీస్తున్నారు.యువ హీరోలకి దీటుగా తీసిపోను అన్నట్టుగా కష్టపడుతున్నారు ఒక వైపు ‘ఆచార్య’ సినిమా విడుదలకు సిద్ధం అవుతుండగా మరో వైపు లూసిఫెర్ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు మెగాస్టార్.
Video Advertisement
ఈ చిత్రాన్ని మోహన్ రాజా దర్శకత్వం వహించ నుండగా ‘ఆచార్య’ సినిమా తరువాత సెట్స్ మీదకి వెళ్లే చిత్రం ఇదే.మరో వైపు మెహర్ రమేష్ తో ‘వేదాళం’ తమిళ రీమేక్ చిత్రాన్ని కూడా ఒకే చేసిన మెగా స్టార్ ఆ చిత్తానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నారు.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా ని నిర్మిస్తుండగా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు చిత్ర యూనిట్ సినిమా టైటిల్ ని వీరయ్య గా చెప్పుకుంటున్నారు ఫిలిం నగర్ వర్గాలు మరి ఇందులో వస్తాం ఎంత ఉంది అన్నది తెలియాలంటే కొన్ని రోజులు ఓపిక పట్టాలి
End of Article