చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటించిన సినిమా ఏమిటో తెలుసా?

చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటించిన సినిమా ఏమిటో తెలుసా?

by kavitha

Ads

నటసింహ బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో అగ్ర నటులుగా, గొప్ప ఇమేజ్ ఉన్న హీరోలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరికి ఉన్న ఫ్యాన్ బేస్ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి చిత్రాలు విడుదల అయితే తెలుగు రాష్ట్రాల్లో హంగామా మామూలుగా ఉండదు.

Video Advertisement

థియేటర్లలో మోత మోగాల్సిందే. వీరిద్దరు ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటారు. ఈ హీరోలిద్దరు ఎన్నోమార్లు థియేటర్లలో ఒకేసారి చిత్రాలను రిలీజ్ చేసి, బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. అలాంటి హీరోలు ఇద్దరు కలిసి ఒక సినిమాలో నటించారు. ఈ విషయం ఎక్కువమందికి తెలియకపోవచ్చు. మరి ఆ సినిమా ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ ఇద్దరు అగ్రనటులే. నటనలోనూ, రికార్డ్స్ లోనూ, ఫ్యాన్ బేస్ లోను వారికి వారే సాటి. వీరిద్దరూ 60 ఏళ్ల వయసు దాటిన కూడా యంగ్ హీరోలతో పోటీపడుతూ వరుస చిత్రాలలో నటిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ఇద్దరు తమ చిత్రాలతో పోటీ పడగా, రెండు చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. వసూళ్ల వర్షం కురిపించాయి. అయితే ఈ రెండు చిత్రాలను నిర్మించింది మైత్రీ మేకర్స్.ఆ సందర్భంలో మీడియా ఇద్దరి కాంబోలో సినిమా చేస్తారా అని అడుగగా,  మైత్రి ప్రొడ్యూసర్స్ చిరు, బాలయ్య కలిసి నటించడానికి ఒప్పుకుంటే ఏ ప్రొడ్యూసర్ అయిన అలాంటి ఛాన్స్ ను వదులుకుంటారా అని అన్నారు. మంచి స్టోరీ దొరికితే, ఆ దిశలో ప్రయత్నాలు మొదలు పెడతామని చెప్పారు. చిరు- బాలయ్య కాంబో కుదిరితే ఆ సినిమా నెక్ట్స్ లెవల్ అని చెప్పవచ్చు. అయితే గతంలో చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరు కలిసి ఒక చిత్రంలో కనిపించారు. ఆ చిత్రం విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘త్రిమూర్తులు’.
ఈ సినిమాలోని ఒక సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కనిపిస్తారు. ఇక  వీరు మాత్రమే కాకుండా సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు, నాగార్జున వంటి స్టార్ హీరోలు కూడా కనిపిస్తారు. ఈ చిత్రం తరువాత చిరంజీవి, బాలకృష్ణలు కలిసి మరో సినిమాలో కనిపించలేదు. ఎన్నో ఏళ్ల నుండి వీరిద్దరు కలిసి నటించాలన్న వీరి ఫ్యాన్స్ కోరికను మైత్రీ మూవీ మేకర్స్ తీరుస్తారేమో చూడాలి.

Also Read: “ఇంక మెసేజ్ లు లేవు… మాస్ మాత్రమే..!” అంటూ… మహేష్ బాబు “గుంటూరు కారం” మాస్ స్ట్రైక్ వీడియోపై 15 మీమ్స్..!


End of Article

You may also like