సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ మూవీ కోసం అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. షూటింగ్ ఆలస్యం కావడం వల్ల వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

Video Advertisement

 

 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. అయితే ఈ మూవీ నుంచి పలు అప్డేట్స్ ఇస్తూ ఫాన్స్ ని ఖుషి చేస్తున్నారు మేకర్స్. గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమా టైటిల్ విషయంలో కాస్త సస్పెన్స్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు గుంటూరు కారం అనే కూల్ టైటిల్ ఖరారు అయ్యిందని ఇన్ సైడ్ వర్గాల నుంచి సమాచారం. ఇక ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

 

mahesh SSMB28 glimpse..

ఇక తాజాగా సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా పలు మాస్ పోస్టర్స్ ని రిలీజ్ చేసారు మేకర్స్. దీంతో ఫాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు. అలాగే ఈ రోజు సాయంత్రం ఈ మూవీ నుంచి టీజర్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసారు. ఈ మాస్ స్ట్రైక్ గ్లింప్స్ యొక్క నిడివి 01 ని. 03 సెకండ్స్ గా ఉంది. ఇందులో మహేష్ ఫుల్ మాస్ అవతార్ లో కనిపించారు. అంతకు ముందు సెన్సార్ బోర్డ్ వారు జారీ చేసిన మాస్ స్ట్రైక్ గ్లింప్స్ యొక్క సర్టిఫికెట్ ని నిర్మాత నాగవంశీ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రకటించారు.

mahesh SSMB28 glimpse..

పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2024 జనవరి 13న విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. అక్షయ్ కోసం త్రివిక్రమ్ ఒక బలమైన పాత్ర రాశాడని టాక్. అయితే అది విలన్ పాత్ర.. లేక ఇంకోటా అనేది తెలియాల్సి ఉంది.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17

#18

watch video :