తన తండ్రితో కలిసి మెగాస్టార్ నటించిన ఈ సినిమా గురించి మీకు తెలుసా.?

తన తండ్రితో కలిసి మెగాస్టార్ నటించిన ఈ సినిమా గురించి మీకు తెలుసా.?

by Mohana Priya

Ads

వెస్ట్ గోదావరి జిల్లాలో మొగల్తూరు అనే ఒక ఊరు. ఆ ఊరిలో 65 ఏళ్ల క్రితం పుట్టారు శివశంకర వరప్రసాద్. శివశంకర వరప్రసాద్ నర్సాపూర్ లో కామర్స్ లో డిగ్రీ చేసిన తర్వాత 1976లో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరుదామని చెన్నైకి బయల్దేరారు. వరప్రసాద్ కుటుంబం మొత్తం ఆంజనేయ స్వామి భక్తులు. అందుకే వరప్రసాద్ తల్లి అతని స్క్రీన్ నేమ్ ని చిరంజీవిగా మార్చుకోమని సలహా ఇచ్చారు.

Video Advertisement

దాంతో 1978 లో ప్రాణం ఖరీదు సినిమాతో చిరంజీవి గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు శివ శంకర వరప్రసాద్. రెండవ సినిమాగా బాపుగారి డైరెక్షన్ లో మన ఊరి పాండవులు సినిమా చేశారు చిరంజీవి. అసలు చిరంజీవి మొదటి సినిమా పునాదిరాళ్లు. కానీ విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదు.

మన ఊరి పాండవులు సినిమా చిరంజీవికి గుర్తింపు తీసుకువచ్చింది. 1982 లో కోడిరామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాలో హీరోగా నటించారు చిరంజీవి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.

source : chiru_FC (twitter)

1984 లో వచ్చిన ఖైదీ చిరంజీవికి స్టార్ డం తీసుకువచ్చింది. ఆ తర్వాత చిరంజీవికి ఇంక వెనక్కి తిరిగి చూసే అవసరం రాలేదు. మంత్రిగారి వియ్యంకుడు, సంఘర్షణ, గుండా, ఛాలెంజ్, హీరో, దొంగ, అడవి దొంగ, కొండవీటి రాజా, రాక్షసుడు, గ్యాంగ్ లీడర్, యముడికి మొగుడు, స్వయంకృషి, పసివాడి ప్రాణం, జగదేకవీరుడు అతిలోకసుందరి , శ్రీ మంజునాథ, ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా ఎంబిబిఎస్, ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డితో పాటు ఇంకా ఎన్నో సినిమాల ద్వారా మనల్ని అలరిస్తున్నారు మన మెగాస్టార్ చిరంజీవి.

చిరంజీవి తండ్రి వెంకట్రావు గారు కూడా కొన్ని సినిమాల్లో నటించారు. అందులో ఒకటి చిరంజీవి నటించిన సినిమానే. చిరంజీవి హీరోగా వచ్చిన మంత్రిగారి వియ్యంకుడు సినిమాలో ఒక పాత్రలో కనిపించారు వెంకట్రావు గారు. ఈ సినిమాలో అల్లు రామలింగయ్య గారితో కలిసి కనిపిస్తారు. అంతే కాకుండా జగత్ కిలాడీలు సినిమాలో కూడా నటించారు వెంకట్రావు గారు.

watch video :


End of Article

You may also like