Ads
బుల్లితెరపై సీరియల్స్ తో పాటుగా సినిమాల్లో కూడా అనుభవముంది మేక రామకృష్ణ గారికి. ఆయన అందరికీ సుపరిచితమే. తాజాగా ఒక ఇంటర్వ్యూ కి వచ్చి కొన్ని విషయాలని పంచుకున్నారు మేక రామకృష్ణ. సెట్ లో ఆర్టిస్టులని దారుణంగా చూస్తారని ఆయన చెప్పారు. ఇండస్ట్రీ లో జరిగే అరాచకాలు గురించి కూడా మాట్లాడారు. మరిక ఆయన షేర్ చేసుకున్న విషయాలు గురించి ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
సినిమా ప్రొడక్షన్ బాయ్స్ చిన్న ఆర్టిస్టులను చులకనగా చూస్తారు. నిజానికి ఇది నరకంలా ఉంటుందని ఆయన చెప్పారు. ప్రొడక్షన్ బాయ్స్ ఘోరంగా ప్రవర్తిస్తారని..ఒక్కోసారి వాళ్ళని చూస్తే ఎంతో కోపం వస్తుందని చెప్పారు. అలానే సెట్ లో భోజనం పెట్టేటప్పుడు కూడా డివైడ్ చేస్తారని చెప్పారు. హీరోలు, నిర్మాతలకి ఒక కేటగిరి.. టెక్నికల్ డైరెక్షన్ కి మరొక దగ్గర.. జూనియర్ ఆర్టిస్టులకు ఇంకో చోట.. సెకండ్ గ్రేడ్ టెక్నీషియన్లుకి మరొక చోట భోజనంపెడతారని ఆయన అన్నారు.
ఒకవేళ కనుక పొరపాటున మనకు కేటాయించిన కేటగిరికి వెళ్ళకుండా మరొకచోటికి వెళితే చాలా హీనంగా చూస్తారు అని ఆయన చెప్పారు. ఒకవేళ ఎవరైనా పొరపాటున ప్రొడక్షన్ బాయ్స్ ని ఏమైనా అంటే కాఫీలో మోషన్ టాబ్లెట్లు కలిపి ఇచ్చేస్తారని చెప్పారు. సీనియర్ నటి అయిన జయసుధ గారికే అలా చేశారని ఆయన అన్నారు. అదే విధంగా టాయిలెట్ లో ఉండే వాటర్ ని డ్రింకింగ్ వాటర్ కింద ఇస్తారట.
అలాగే ఆయనకి ఒక రోజు ఒక పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చిందట. సెట్లో ఆయన ఎనిమిది మందితో పాటు కలిసి కూర్చుని భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో అందరికీ వేడి వేడి అన్నం వడ్డించారు. కానీ ఆయనకీ మాత్రం వేరే అన్నం తెచ్చి పెట్టారట. అదేంటి అని అడిగితే మీకు అంత రేంజ్ లేదు అని బదులిచ్చారు. అలా దర్శక నిర్మాతల అందరి ముందు అనే సరికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి అని.. ఎంతో బాధపడ్డాను, చచ్చిపోవాలనిపించింది అని చెప్పారు.
End of Article