Ads
అందాల భామ నిధి అగర్వాల్ కు తెలుగు నాటే కాదు..తమిళనాట కూడా చాలా మంది అభిమానులే ఉన్నారు. సవ్యసాచి తో తెలుగు వారికి దగ్గరైన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత అఖిల్ “మజ్ను” సినిమా లో నటించారు. గతేడాది రామ్ “ఇస్మార్ట్ శంకర్ ” సినిమా తో నిధి అగర్వాల్ స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. ఆమె ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాలో సైతం నటించే అవకాశాన్ని కొట్టేసారు.
Video Advertisement
తమిళనాట కూడా ఈ ఏడాది సంక్రాంతి కి నిధి అగర్వాల్ సినిమాలు రెండు విడుదల అయ్యాయి. “భూమి” సినిమా ఓటిటి రిలీజ్ అవ్వగా, “ఈశ్వరన్” సినిమా థియేటర్ లో విడుదల అయింది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు నిధి అగర్వాల్ కు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. ఈ వాలెంటైన్స్ డే సందర్భం గా తమిళ, తెలుగు అభిమానులు కలిసి ఆమెకు ఊహించని గిఫ్ట్ ను ఇచ్చారు.
తమిళనాట ఆమెకు ఏకం గా గుడిని కట్టేసారు. గతం లో ఎంజీఆర్, జయలలిత, నమిత, హన్సిక, ఖుష్భు, వంటి స్టార్ లకు వారు గుడి కట్టారు. తాజాగా, నిధి అగర్వాల్ కి కూడా వారు గుడి కట్టేయడం తో ఆమె ఆనందం తో ఉబ్బితబ్బిబ్బైపోతోంది. ఇంత ప్రేమను ఉహించలేదంటూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. తాజాగా, ఈ విషయమై పలు ట్రోల్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. అవేంటో.. మీరు కూడా ఓ లుక్ వేయండి.
#1.
#2.
#3.
#4.
#5.
#6.
#7.
#8.
#9.
#10.
#11.
#12.
End of Article