కాలం మారుతున్న ఆడపిల్లల నుదుటిరాతలు మాత్రం మారడం లేదు. ఆడపిల్లలను పురిటిలోనే చంపేస్తున్నారు. ఇలాంటి ఉదాహరణే మరొకటి జరిగింది. రాజా బైయా యాదవ్ అనే ఛతార్పూర్‌కు చెందిన వ్యక్తి ఇద్దరు అమ్మాయిలే పుట్టారని.. భార్యని బావిలో తోసేసాడు. తొమ్మిది సంవత్సరాల క్రితం రాజా కు పెళ్లయింది. అయితే పెళ్ళైన ఏడాదికే ఒక అమ్మాయి జన్మించింది. కొడుకు కావాలని భార్యని వేధించేవాడు. కొన్నాళ్ళు సంతానం కోసం కూడా ప్రయత్నించలేదు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చింది.

women in well

ఇటీవల అతని భార్య గర్భం దాల్చింది. ఈ సారైనా కొడుకు పుడతాడని రాజా భావించాడు. కానీ మళ్ళీ కూతురు పుట్టడం తో నిరాశ చెందాడు. కూతురుకు మూడు నెలలు నిండేవరకు అతని భార్య పుట్టింట్లోనే ఉంది. మూడు నెలలు నిండాక.. ఆమెను తీసుకురావడానికి వెళ్లిన రాజా తిరిగి వచ్చే క్రమం లో భార్య పిల్లలను బావిలోకి తోసేసాడు. ఈ క్రమం లో భార్యా, చిన్నారి ప్రాణాలతో బయటపడ్డా.. పెద్ద కూతురు మాత్రం చనిపోయింది.