మిడతల బారి నుండి ఆహారాన్ని రక్షించుకోవడమెలా? ప‌ద్మ‌శ్రీ అవార్డ్ గ్ర‌హీత చెప్పిన సింపుల్ టెక్నిక్..!

మిడతల బారి నుండి ఆహారాన్ని రక్షించుకోవడమెలా? ప‌ద్మ‌శ్రీ అవార్డ్ గ్ర‌హీత చెప్పిన సింపుల్ టెక్నిక్..!

by Anudeep

Ads

కరోనా భయం పోనే లేదు.. మరో ఉపదృవం రానుందని ప్రజలకు భయం పట్టుకుంది.. లోకస్ట్(మిడత) అనే కొత్త విలన్ దాడి చేయబోతుంది..దీని దాడికి మనిషి ప్రాణాలకు ముప్పులేదు కానీ ఆహారానికి ముప్పు ఉంది.. ఒకటి రెండు కాదు లక్షల సంఖ్యల్లో మిడతలు ఒకే సారి దాడి చేసి 35వేలు మంది తినే ఆహారాన్ని తినేయగలవు..అంటే మామూలు విషయం కాదు…మరి వీటి దాడి నుండి ఆహారాన్ని రక్షించుకోవడమెలా?? ఒక సమస్య ఉంటే పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది.. ఆ పరిష్కారం ఏంటంటే..

Video Advertisement

midathalu

midathalu

మిడతలు దాడి చేయబోతున్నయనే వార్త సోషల్ మీడియాలో వైరలవుతున్నట్టుగానే , వాటినుండి ఆహారాన్ని రక్షించుకోవడమెలా అనే వార్త కూడా ప్రస్తుతం వైరల్ టాపిక్ గా మారింది..పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట్ రెడ్డి పద్దతి ప్రకారం..

ఏం చేయాలి??

మీ పొలంలో 2 అడుగుల గుంత తీసి…అక్క‌డి నుండి 4 అడుగుల లోతు వ‌ర‌కు ఉన్న మ‌ట్టిని ( ఈ మ‌ట్టిలో బంక ఎక్కువ‌గా ఉంటుంది) తీసి 200 లీట‌ర్ల నీటికి 30-40 కేజీల త‌వ్విన మ‌ట్టిని క‌లిపి ప‌ది నిమిషాల పాటు క‌లియ‌తిప్పాలి. త‌ర్వాత ఆ నీటిని వ‌డ‌క‌ట్టి….పొలంపై పిచికారీ చేయాలి. నీరు బురదగా ఉంది పంటకు ఇబ్బంది అవుతుందేమో అనే భయం అక్కర్లేదు. అలా మట్టి ఉండటం వల్ల ప్రస్తుతం ఉన్న అధిక ఎండల నుండి కూడా మొక్కలు తట్టుకుంటాయి.నీటి డ్రమ్ము అడుగున మిగిలిన మట్టిద్రావణాన్ని చెట్ల మొదళ్ల వద్ద వెయ్యండి..

బుర‌ద మ‌ట్టి ధాన్యంపై పేరుకుపోవ‌డం వ‌ల్ల‌.. మిడ‌త‌లు వాటిని తిన‌లేవు.. ఎందుకంటే మిడ‌త‌ల‌కు కాలేయం ఉండ‌దు కాబ‌ట్టి ..మ‌ట్టి జీర్ణం కాదు. అది తిన్న కాసేప‌టికే చ‌నిపోతాయి. అలా బురద ఉన్న పంటవైపు మిడతలు రావు..దీని మూలంగా మనకు ఖర్చయ్యేది కేవలం మన శ్రమ మాత్రమే..మిడతల బెడద తీరిన తర్వాత ఒక్కసారి నీటిని పిచికారి చేస్తే మొక్కలపై ఉన్న బురద పోతుంది. కాబట్టి  పంటలపై రోజువిడిచి రోజు 4-5సార్లు ఇలా బురద నీటిని పిచికారి చేస్తే మన పంటని రక్షించుకోవచ్చు.


End of Article

You may also like