Ads
మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో అమెజాన్ ప్రైమ్ మరొక హిట్ కొట్టింది. నవంబర్ 20 వ తేదీన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలయింది. ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, సినిమా చాలా నాచురల్ గా ఉంది. పాత్రలు కూడా అంతే నాచురల్ గా ఉన్నాయి. అసలు ఈ సినిమాకి పెద్ద హైలెట్ హీరో తండ్రి కొండల్ రావు పాత్ర. ఈ పాత్రకి చాలా మంది రిలేట్ అయ్యారు. ఈ పాత్రని పోషించిన యాక్టర్ గోపరాజు రమణ.
Video Advertisement
ఒక వైపు కోపం, ఇంకొక వైపు ప్రేమ ఇలా అన్నీ ఎమోషన్స్ ఉన్న కొండల్ రావు పాత్రని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు గోపరాజు రమణ. ఈ సినిమాకి రివ్యూ ఇచ్చిన ప్రతి ఒక్క క్రిటిక్ గోపరాజు రమణ పర్ఫామెన్స్ ని ప్రశంసించారు. ఇలా అంతకుముందు కూడా ఎంతో మంది నటులు పోషించిన తండ్రుల పాత్రలు ఎక్కడో ఒక చోట నిజజీవితానికి రిలేట్ అయ్యేలా ఉంటాయి. వాళ్ళు ఎవరంటే.
#1 కోట శ్రీనివాసరావు
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
ఈ సినిమాలో కోట శ్రీనివాస్ రావు గారికి, వెంకటేష్ కి మధ్య వచ్చే సీన్స్ చాలా రియలిస్టిక్ గా అనిపిస్తాయి.
#2 రావు రమేష్
మజిలీ
ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే రావు రమేష్ నటనకి వంక పెట్టలేం. ఈ సినిమాలో కూడా అంతే బాగా చేశారు.
#3 సముద్రఖని
రఘువరన్ బీటెక్
ఈ సినిమా స్ట్రైట్ తెలుగు సినిమా కాకపోయినా కూడా, తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా కనెక్ట్ అయింది. అందులోనూ ముఖ్యంగా ధనుష్, ధనుష్ తల్లి పాత్ర పోషించిన శరణ్య, ధనుష్ తండ్రి పాత్ర పోషించిన సముద్రఖని పాత్రలు అయితే మనకి తెలిసిన వాళ్ళ లాగా అనిపిస్తారు.
#4 గోపరాజు రమణ
మిడిల్ క్లాస్ మెలోడీస్
అటు సీరియస్ గా ఉంటూనే, కామెడీ టైమింగ్ కూడా కరెక్ట్ గా ఉన్న పాత్రలో చాలా బాగా నటించారు గోపరాజు రమణ.
#5 ఎస్పీ బాలసుబ్రమణ్యం
ప్రేమికుడు
బాలసుబ్రహ్మణ్యం గారిలో అద్భుతమైన గాయకులు మాత్రమే కాదు, అద్భుతమైన నటులు కూడా ఉన్నారు అని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది.
#6 చంద్రమోహన్
7/G బృందావన్ కాలనీ
నువ్వు నాకు నచ్చావ్
అసలు చంద్రమోహన్ గారి గురించి అందులోనూ 7/G బృందావన్ కాలనీ సినిమాలో ఆయన పాత్ర గురించి ఇంట్రడక్షన్ అవసరమే లేదు. సినిమా వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా సరే మనం సోషల్ మీడియాలో రోజుకి ఒక్కసారైనా చంద్రమోహన్ గారు హీరోని కొట్టే టెంప్లేట్ చూస్తూనే ఉంటాం.
#7 ప్రకాష్ రాజ్
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
కొత్త బంగారులోకం
కొత్త బంగారులోకం సినిమాలో తన కొడుకుకి ఏది నచ్చితే అది ఇవ్వాలి అనుకునే తండ్రిగా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో అవతలివాళ్ళు ఎలాంటి వాళ్లయినా సరే మనం మాత్రం అందరితో మంచిగానే ప్రవర్తించాలి అనుకునే వ్యక్తిగా ప్రతి పాత్రకి న్యాయం చేశారు ప్రకాష్ రాజ్.
#8 తనికెళ్ల భరణి
జులాయి
తనికెళ్ల భరణి గారు ఎంత మంచి నటులో చెప్పాల్సిన అవసరం లేదు. అంత మంచి నటుడికి త్రివిక్రమ్ డైలాగ్స్ యాడ్ అయితే ఆ పాత్ర స్క్రీన్ పై ఎంత బాగా కనిపిస్తుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.
End of Article