కళ్ళ ముందే ప్రాణమిత్రుడి ప్రాణాలు పోతున్నా ఏమి చేయలేని పరిస్థితి..!!

కళ్ళ ముందే ప్రాణమిత్రుడి ప్రాణాలు పోతున్నా ఏమి చేయలేని పరిస్థితి..!!

by Anudeep

Ads

మనకి వస్తే కష్టం అదే మనవాళ్లకి వస్తే నరకం.. మన కళ్లముందే ప్రాణ స్నేహితుడి ప్రాణం పోతుంటే, కాపాడలేని నిస్సహాయ స్థితిలో ఉంటే దానికంటే దురదృష్టం మరొకటి ఉండదు. వారిద్దరి స్నేహం వయసు ఒకటి రెండేళ్లు కాదు.. చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు..స్నేహమే శ్వాసగా బతికారు..ఒకరి వెంట ఒకరు నడిచారు..కాని ఇఫ్పుడు ఆ అడుగులను వదిలేసి అమృత్ వెళ్లిపోయాడు..అమృత్ ని ఒంటరి చేసి..ఉత్తరప్రదేశ్ కి చెందిన అమృత్,సాయుబ్ ల కథ నెటిజన్లందరిని కంటతడి పెట్టిస్తుంది..

Video Advertisement

ఉత్తరప్రదేశ్ కి చెందిన సాయుబ్, అమృత్ లు చిన్నప్పటి నుండి స్నేహితులు.. ఒక వయసు వచ్చేసరికి కుటుంబ బాద్యతలు  పైన పడ్డాయి..ఊర్లో పనులు లేక సాయుబ్ పని వెతుక్కుంటూ ముంబై వెళ్లాడు.. మరో వైపు అమృత్ ది  కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే.. తను కూడా పని వెతుక్కుంటూ సూరత్ వెళ్లి అక్కడ టెక్స్ టైల్ కంపెనీలో పనికి చేరాడు.. ఇద్దరూ దూరమయ్యారు..కానీ ఆ దూరం తాత్కాలికమే..

వెంటనే సాయుబ్ ని తన దగ్గరకి పిలుచుకున్నాడు అమృత్ ..ఇద్దరూ ఒకే దగ్గర వేర్వేరు టెక్స్ టైల్ కంపెనీల్లో పని, ఒకే రూమ్.. పనికి వెళ్లడం, తిరిగి వచ్చి స్నేహితులిద్దరూ గడపడం..వచ్చిన జీతం ఇంటికి పంపించడం..ఇదే జీవితం..కరోనా రూపంలో ఉపాది పోయింది. కంపెనీలు మూసేయడంతో దాచుకున్న డబ్బులయిపోతున్నాయి. పెరుగుతున్న లాక్డౌన్ తో కంపెనీలు తెరుస్తారనే ఆశ పోయింది.ఊరెళ్లిపోదామంటే బండ్లు లేవు.

కానీ ఒక రోజు ఉదయం వారికి ఒక విషయం తెలిసింది యూపికి ఒక ట్రక్ పోతుంది, మనిషికి 4000రూపాయలని.. చేతిలో ఉన్న 10,000రూపాయలతో ఇంటికి వెళ్దామని డిసైడయ్యారు..కాని ఊరికి వెళ్లాక ఇంట్లో వాళ్ల పరిస్థితి అంతంత మాత్రమే అస్సలు డబ్బులు లేకుండా ఎలా వెళ్లడం అని అమృత్ ఆందోళన..ప్రస్తుతం ఈ గండం గట్టెక్కితే చాలు, లాక్ డౌన్ ఎత్తేశాక, కంపెనీలు తెరిచాక మళ్లీ సంపాదించుకుందాం అని స్నేహితుడికి ధైర్యం చెప్పాడు సాయుబ్.

సొంత ఊరికి వెళ్తున్నమన్న ఆనందంలో ఇద్దరూ స్నేహితులూ ఉన్నారు..అమృత్ కి ఒంట్లో నలతగా అనిపించింది. జ్వరం కూడా ఉంది,దాంతో పారసిటమాల్ వేసుకుని,ట్రక్ ఎక్కాడు..ట్రక్ కి పైన కప్పులేదు.. ఎండ విపరీతంగా ఉంది.అమృత్ ఆరోగ్యం మరింత క్షీణించింది. మధ్యప్రదేశ్ మీదుగా కొలరాస్ చేరుకునే సరికి అమృత్ ఒళ్ళు విపరీతంగా మరింత వేడెక్కింది..స్నేహితున్ని డాక్టర్కి చూపించాలని,ట్రక్ ఆపమని డ్రైవర్ ని కోరాడు సాయుబ్, వస్తే రండి లేకపోతే లేదు అని తోటి ప్రయాణికులు అనడంతో స్నేహితుడితో పాటు ట్రక్ దిగిపోయాడు.

రోడ్డు పక్కన దీనంగా కూలబడిన స్నేహితుడిని ఒళ్ళోకి తీసుకుని కర్చీఫ్ తడిపి అమృత్ నుదుటిపై రుద్దడం మొదలు పెట్టాడు సాయుబ్. ఆ దృశ్యం చుట్టుపక్కల  వారిని కదిలించింది. ఎవరో అంబులెన్స్ కు ఫోన్ చేశారు.దగ్గరలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో డాక్టర్ ఓఆఎస్ ఇచ్చాడు. 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివపూరి జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్ కి తీసుకెళ్ళమని చెప్పాడు డాక్టర్. అంబులెన్స్ లో అక్కడికి వెళ్లారు. అక్కడ అమృత్ ని ఐసీయూలో పెట్టారు. కానీ ఫలితం లేకపోయింది.. అమృత్ ప్రాణాలు విడిచాడు..తన స్నేహితున్ని వదిలి వెళ్లిపోయాడు.. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన స్నేహితుడు కళ్లముందే దూరమయ్యేసరికి సాయుబ్ గుండె పగిలేలా ఏడ్చాడు.. స్నేహితులిద్దరి కథ తెలిసిన ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టిస్తోంది.


End of Article

You may also like