సైకిల్ దొంగలించి…ఓనర్ కి ఆ వలసకూలీ ఏమని లెటర్ రాసారో తెలుసా? చూస్తే కన్నీళ్లొస్తాయి!

సైకిల్ దొంగలించి…ఓనర్ కి ఆ వలసకూలీ ఏమని లెటర్ రాసారో తెలుసా? చూస్తే కన్నీళ్లొస్తాయి!

by Anudeep

Ads

“నేను కూలీని,ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఈ తప్పు చేస్తున్నాను, నన్ను క్షమించండి . మీ సైకిల్ తీసుకువెళ్తున్నాను ,నేను బరేలికి వెళ్లాలి.దానికి తోడు నా కొడుకు వికలాంగుడు.కాబట్టి నా ఇంటికి చేరుకోవడానికి వేరే మార్గాలు లేక మీ సైకిల్ తీసుకుంటున్నాను”  ఇది ఒక వలస కూలి రాసిన లెటర్..  సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ లెటర్ ప్రస్తుత పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది.

Video Advertisement

లాక్‌డౌన్‌ ప్రకటించడంతో చేయడానికి పనులు లేక, తినడానికి తిండి లేక రెక్కాడితే కాని డొక్కాడని వలస బతుకులన్ని ఆగమాగమయ్యాయి..దీంతో ఎటూ దిక్కుతోచక సొంతూరికి పోతే కనీసం కలోగంజో తాగి బతకొచ్చు అని అందరూ ఊరిబాట పట్టారు. చంటిపిల్లల్ని, వయసు పై బడిన వారిని తీసుకుని అందరూ కాలినడకన వేలమైళ్లు నడుచుకుంటూ ఊరికి వెళ్తున్నారు.వారిలో గమ్యం చేరే వారు కొందరైతే, మధ్యలోనే అష్టకష్టాలు పడుతున్నవారు కొందరు.

representative image

మహమ్మద్ ఇక్బాల్ అనే వలస కార్మికుడు  ఉత్తర ప్రదేశ్‌లోని ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఒక్కడే ఉంటే నడుచుకుంటూ వెళ్లేవాడే..తనతో పాటు వికలాంగ కొడుకు ఉన్నాడు..అతడు నడవలేడు..ఇక్బాల్ అతన్ని ఎత్తుకుని ఎంత దూరమని పోగలడు.. దాంతో రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లాలో, రారా గ్రామంలో సహబ్ సింగ్ అనే వ్యక్తి ఇంటి నుండి  సైకిల్‌ను దొంగిలించాడు.

representative image

తన అవసరార్దం దొంగతనం అయితే చేశాడు కానీ, ఇక్బాల్ మనసు దానికి అంగీకరించలేదు.. ఆత్మాభిమానంతో కష్టపడి వచ్చిన రూపాయితోనే బతికిన వారికి ఎవరి మనసైనా ఒప్పుకోదు..దాంతో తన పరిస్థితిని వివరించి  క్షమించమని ఒక ఉత్తరం రాసి ఆ ఇంటి పరిసరాల్లో వదిలేసి వెళ్లాడు. సింగ్ తన ఇంటిని శుభ్రం చేస్తుండగా ఈ లేఖ కనిపించింది.అందులో “మెయిన్ మజ్దూర్ హన్, మజ్బూర్ భీ. మెయిన్ ఆప్కా గునెగర్ హు. ఆప్ కీ సైకిల్ లేకర్ జా రాహా హు. ముజే మాఫ్ కర్ దేనా. ముజే బరేలీ తక్ జన హే. మేరే పాస్ కోయి సాధన్ నహి హి.. ఔర్ విక్లాంగ్ బచ్చా హై.. అని హిందీలో రాసి ఉంది.

representative image

ముందు సైకిల్ కనపడకపోయే సరికి అగ్గి మీద గుగ్గిలమైన ఆ సైకిల్ ఓనర్ , ఈ లెటర్ చూసి శాంతించాడు.. తన సైకిల్ ఒక కుటుంబానికి సహాయం చేసినందుకు సంతోషించాడు.. ప్రస్తుతం మహమ్మద్ ఇక్బాల్ రాసిన ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.


End of Article

You may also like