క్వారెంటైన్ లో ఉన్న ఆ వలసకూలీలు చేసిన పనికి మెచ్చుకోకుండా ఉండలేం…!

క్వారెంటైన్ లో ఉన్న ఆ వలసకూలీలు చేసిన పనికి మెచ్చుకోకుండా ఉండలేం…!

by Anudeep

Ads

ఊరికి వెళ్లడానికి ఎటువంటి రవాణా సదుపాయం లేకపోయినా కాలినడకన, ఖాళీ కడుపులతో ఊరికి చేరిన వలస కూలీలెందరో.. కొందరు మధ్యలోనే ఆగిపోయారు..కాదు ప్రభుత్వాలే ఎక్కడివాళ్లనక్కడ ఆపేశారు..ఎందుకంటే వైరస్ కి మనిషే ప్రధాన వాహకం..అలా మధ్యలోనే ఆగిపోయిన వారికి స్కూళ్లు, ఫంక్షన్ హాల్లే వసతిగా మారాయి..రాష్ట్ర ప్రభుత్వాలే వారికి ఆహార, వసతి కల్పించాయి. అలా ఆగిపోయిన వాళ్లది ఒక్కోక్కరిది ఒక్కో కథ అయితే రాజస్థాన్ లోని వలస కార్మికులది మరో కథ..వాళ్లేం చేసారో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేం..

Video Advertisement

ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు లాక్‌డౌన్ కారణంగా రాజస్థాన్‌ నుంచి సొంతూళ్లకు బయల్దేరారు. కానీ సికార్‌లో వారిని ఆపేశారు అధికారులు, వారందరిని ఓ స్కూల్లో క్వారంటైన్లో ఉంచారు. పనిచేయడం అలవాటైన మనుషులకు ఖాళీగా కూర్చోమంటే కూర్చోలేకపోయారు. ఒకట్రెండు రోజులు గడిచాయి..మూడోరోజు ఆ ఊరి సర్పంచ్ ని పిలిచి వాళ్లేం పని చేయాలనుకుంటున్నారో చెప్పారు..ఇంతకీ వాళ్లు చేయాలనుకున్న పనేంటంటి ఆ స్కూల్ కి పెయింట్స్ వేయాలని అనుకున్నారు. అదే విషయం సర్పంచ్ కి చెప్పారు.

వాళ్లకి బస చేయడానికి ఇచ్చిన స్కూల్ గోడలు పాతబడినట్టుగా గమనించిన వాళ్లు, ఆ గోడలకు పెయింట్ వేస్తామని చెప్పడంతో సర్పంచ్, ఆ గ్రామస్తులు పెయింట్స్ , బ్రష్ లు వారికి సమకూర్చారు. దాంతో మన వాళ్లు ఆ స్కూల్ రూపు రేఖలు మార్చేశారు. దాదాపు తొమ్మిదేళ్లుగా పెయింటింగ్స్ కి నోచుకోని ఆ స్కూల్ ఇప్పుడు ఆ కూలిల పుణ్యమాని  కొత్తదానిలా మెరిసిపోతుంది.

వాళ్లు చేసిన పనికి ఆ గ్రామ సర్పంచ్, గ్రామస్థులు వారికి డబ్బులివ్వబోతే, మాకు ఇన్నాళ్ళూ ఉచితంగా భోజనాలు పెట్టారు. అందుకుగాను మేమూ ఏదో ఒకటి చేయాలనుకున్నాము. పాఠశాల భవనానికి పెయింట్ వేసే అవకాశం లభించింది. మాకు డబ్బులివ్వాల్సిన అవసరం లేదు.అయినా మీరు ఏమైనా ఇవ్వదలచుకుంటే మీ ఊరి ఈ పాఠశాలకే ఇవ్వండి అని , డబ్బును నిరాకరించి వారి పెద్ద మనసు చాటుకున్నరు..

 


End of Article

You may also like