Home Filmy Adda సినిమా రిలీజ్‌కి ముందే… “లైగర్” గురించి మైక్ టైసన్ ఇలా మాట్లాడారేంటి..? (వీడియో)

సినిమా రిలీజ్‌కి ముందే… “లైగర్” గురించి మైక్ టైసన్ ఇలా మాట్లాడారేంటి..? (వీడియో)

by Anudeep

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించిన “లైగర్” మూవీ ఆగస్ట్ 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ అయ్యింది . ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేసింది.

ప్రముఖ అంతర్జాతీయ బాక్సింగ్ దిగ్గజం ‘మైక్ టైసన్’ ఈ చిత్రంలో తళుక్కున మెరిశారు. ఆ చిత్రంలో కీలక పాత్రలో నటించిన మైక్ టైసన్ వల్ల అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా లైగర్ చిత్రం గురించి గతంలో మైక్ టైసన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

mike tyson comments on liger movie before the release

వివరాల్లోకి వెళ్తే.. మైక్ టైసన్ తాజాగా అమెరికాలోని ఓ యు ట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో భాగంగా యాంకర్లు ‘లైగర్’ సినిమా గురించి అడగ్గా.. మైక్ అర్థం కానట్లు చూసారు. దీంతో యాంకర్లు మొదట ఆశ్చర్య పోయినా.. తర్వాత తేరుకున్నారు నవ్వుకున్నారు. వెంటనే సినిమా కాన్సెప్ట్ ట్రైలర్ ప్లే చేశారు. అది చూసిన మైక్ ” అందులో ఉన్నది నేనే అనుకుంట..దీని గురించి నాకు తెలీదు”.. అంటూ కామెంట్ చేసారు. ప్రస్తుతం దీనికి సంబంధిన వీడియో నెట్లో వైరల్ అవుతోంది. అంతే కాకుండా ఈ సినిమాని చాలాసార్లు బాలీవుడ్ సినిమా అని అన్నారు.

minus points in vijay devarakonda liger trailer

“అసలు ఇది తెలుగు సినిమా కదా. బాలీవుడ్ సినిమా అని ఎలా అన్నారు? ఆ మాత్రం కూడా తెలియకుండా ఈ సినిమాలో నటించారా?” అని అంటున్నారు. విజయ్ దేవరకొండ ఎంతో చెమటోడ్చి ఈ సినిమాలో కష్టపడితే మైక్ ఇలా అనేశారేంటని విజయ్ అభిమానులు వాపోతున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ మైక్ టైసన్ గురించి మాట్లాడుతూ .. “సెట్లో ఆయన ఎంతో సరదాగా ఉండేవారు. తనను ఎప్పుడు బూతులు తిడుతూ ఉండేవారు. అవేంటో బయటకు చెప్పను. కానీ ఆయనతో పని చేయడం ఎంతో సంతోషంగా ఉంది ” అని అన్నారు. ఈ చిత్రంతో అనన్య పాండే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. మరోవైపు విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో అడుగు పెట్టాడు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ, రోనిత్ రాయ్ కీలక పాత్రలు పోషించారు.

watch video :

You may also like