బిడ్డకు జన్మనిచ్చే ముందు రోజు దేశం కోసం ఆ మహిళ ఏం చేసారో తెలుసా? హ్యాట్సాఫ్ మేడం.!

బిడ్డకు జన్మనిచ్చే ముందు రోజు దేశం కోసం ఆ మహిళ ఏం చేసారో తెలుసా? హ్యాట్సాఫ్ మేడం.!

by Anudeep

Ads

కరోనా టెస్టింగ్ కిట్ మేడిన్ ఇండియా.. విదేశాల నుండి దిగుమతి అయిన కరోనాతో పాటు కరోనాని టెస్ట్ చేసే టెస్టింగ్ కిట్ ని కూడా విదేశాల నుండే దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఖర్చు అధికం, ఇక్కడ టెస్టు చేయాల్సి కేసులు సంఖ్య పెరిగిపోతోంది . ఇదే కొసాగితే పరిస్థితి మరీ విషమించేలా ఉంది . దాంతో మనమే సొంతంగా ఒక కిట్ తయారు చేస్కోవాలని నిర్ణయించారు. ఆ కిట్ తయారు చేసింది ఎవరో కాదు ఒక మహిళ… పేరు మినాల్ దాఖవే భోస్లే..

Video Advertisement

మహిళ అని ఎందుకు అంత నొక్కి చెప్తున్నానంటే మన దేశంలో మహిళల పట్ల ఎంత చిన్నచూపో అందరికి తెలిసిందే , వాళ్లకి చదువులెందుకు , ఉద్యోగాలెందుకు అని అన్నీ అడ్డంకులే . కాని ఇప్పుడు  ప్రపంచం మొత్తం వణికిపోతున్న కరోనా టెస్టింగ్ కిట్ కనుగొని గర్వకారంగా నిలవడమే కాదు అలాంటి వాళ్ల నోళ్లు మూయించేలా చేశారు పూణె కి చెందిన మినాల్ దాఖవే భోస్లే .

పూణె లోని మై ల్యాబ్ డిస్కవరి సంస్థ కరోనా కిట్ తయారు చేయడానికి అనుమతి పొందింది. ఈ కిట్ తయారి వైరాలజిస్ట్ మినాల్ దాఖవే బోస్లే ఆధ్వర్యంలో జరిగింది. మరో నెల రోజుల్లో మినాల్ డెలివరి అనగా మన దగ్గర కరోనా కలవరం స్టార్టయింది. నాకెందుకులే నా ఆరోగ్యం ముఖ్యం,  నా కడుపులో బిడ్డ ముఖ్యం అని అనుకోలేదు మినాల్ . సరిగ్గా తన ప్రసవానికి ముందు రోజు కిట్ తయారి పూర్తైంది. తర్వాత డెలివరిలో తను పండంటి బిడ్డకు జన్మనిచ్చారు మినాల్.

 

కరోనా కిట్ తయారు చేయడానికి మై ల్యాబ్ డిస్కవర సంస్థ అనుమతి పొందగానే పనిలోకి దిగిపోయింది. ఆరు వారాలు శ్రమించి కరోనా కిట్ తయారు చేసి దేశానికి అందించింది. ఇది చవకైనదే కాదు మనకు చాలాతొందరగా రిజల్ట్ ను కూడా అందిస్తుంది.ఇప్పటివరకు మనం దిగుమతి చేసుకుంటున్న కిట్ ధర 4500రూ. అయితే మినాల్ టీం తయారు చేసిన కిట్ రేటు 1200రూ మాత్రమే .సగానికి సగం తక్కువ. రిపోర్ట్ రిజల్ట్ టైం ఇంపోర్టెడ్ కిట్ కి ఏడు గంటలు పడితే, మేడిన్ ఇండియా కిట్ రెండున్నర గంటల్లో రిజల్ట్ వచ్చేస్తుంది.

ఇప్పటివరకు 19 కిట్లను అందించింది ఈ సంస్థ. మరో రెండు మూడు రోజుల్లోనే 150కిట్ల వరకు వివివధ రాష్ట్రాలకు పంపిస్తామని , తర్వాత వెంటనే సెకండ్ బ్యాచ్ కిట్ల తయారి స్టార్ట్ చేస్తామని చెప్పుకొచ్చింది.దీని వలన చాలా తక్కువ టైంలోనే ఎక్కువ మందికి టెస్టులు చేయడానికి వీలవుతుంది .  కరోనా టెస్టులు చేయడం కష్టంగా మారేది .ఇకపై ఈ కిట్ల సాయంతో చాలా తక్కువ సమయంలోనే కరోనా వైరస్ సోకిన వారిని గుర్తించడం సులువవుతుంది. థాంక్యూ మినాల్ దాఖవే .. కంగ్రాట్స్ టు బ్లెస్డ్ విత్ బేబీ గర్ల్ లైక్ యూ…

దేశానికి సేవ చేసే అవకాశం నాకు ఈ విధంగా దక్కింది, అందుకే నా వంతుగా కృషి చేసా. మొత్తం పదిమందిమి ఈ ప్రాజెక్ట్ ని ఆరువారాల్లో పూర్తి చేసాం. మీ వంతుగా మీరు దేశానికి సేవ చేయాలనుంటే జాగ్రత్తలు పాటించండి, వైరస్ వ్యాప్తి చేయకుండా చూడండి అని అన్నారు మినాల్.


End of Article

You may also like