Ads
కరోనా వైరస్ కాంరంగా యావత్ భారతావని లాక్ డౌన్ ని పాటించాల్సి వచ్చింది ..ఈ దెబ్బతో అన్ని పరిశ్రమలు దాదాపుగా 50 రోజులు అవుతున్నా ఇంకా అన్ని మూత పడే ఉన్నాయి.సినీ ఇండస్ట్రీ కూడా లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి.సినిమా థియేటర్స్ కూడా మూత పడటం సినీ పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బే.లాక్ డౌన్ 4 లో కొద్దీ పాటి సడలింపులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం…
Video Advertisement
తమ తదుపరి కార్యాచరణని ఎలా కొనసాగించాలని తెలంగాణ మంత్రి తలసాని యాదవ్ తో చిరు ఇంట్లో కీలక భేటీ నిర్వహించారు.ఈ భేటీ లో నిర్మాతలు దిల్ రాజు,అల్లు అరవింద్,త్రివిక్రమ్,రాజమౌళి,మొదలగువారు హాజరయ్యారు.సినీ పరిశ్రమని నమ్ముకొని వేల మంది కార్మికులు బ్రతుకుతున్నారు..వారి మనుగడ కొనసాగాలన్నా…మరియు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరో సినిమాలనే నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు.వారందరిని దృష్టిలో పెట్టుకొని తగు నిర్ణయాలు తీసుకోవాలని చర్చించినట్టు తెలుస్తుంది.ఇప్పటికే చాల వరకు పెద్ద సినిమాలు షూటింగ్స్ దశలో ఉన్నాయి..మరి కొన్ని విడుదలకి సిద్ద్దంగా కూడా ఉన్నాయి..కొందరు నిర్మాతలు సినిమా థియేటర్లు ఎప్పుడు తీస్తారో తెలియక OTT బాట పడుతున్నారు ఆ ప్లాట్ఫామ్ లో విడుదల చేస్తుకుంటున్నారు.అసలు సినిమా థియేటర్స్ ఇప్పట్లో ఉంటాయా ? ఒకవేళ ఉన్న కూడా జనాలు సినిమా హాళ్ళకి రావటానికి ఇష్ట పడుతారా ? షూటింగ్స్ ని ఎలా కొనసాగించాలి అన్న వాటిపై కూలంకుషంగా చర్చిస్తున్నారు.
End of Article