గుంటూరు కారం సినిమాకి ఈ ఒక్క విషయమే మైనస్ అయ్యిందా..?

గుంటూరు కారం సినిమాకి ఈ ఒక్క విషయమే మైనస్ అయ్యిందా..?

by Mohana Priya

Ads

ఎన్నో అంచనాల మధ్య మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. దాదాపు 13 సంవత్సరాల తర్వాత మళ్లీ వీళ్ళిద్దరూ కలిసి పనిచేశారు. అయితే ఈ సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది.

Video Advertisement

కొంత మంది బాగుంది అంటే, మరి కొంతమంది మాత్రం రొటీన్ సినిమా లాగా ఉంది అని అంటున్నారు. సినిమా కోసం మహేష్ బాబు చాలా కష్టపడ్డారు. మళ్లీ చాలా రోజుల తర్వాత యాక్టింగ్ కి ఆస్కారం ఉన్న ఒక పాత్ర మహేష్ బాబుకి దొరికింది. కొన్ని సీన్స్ అయితే చాలా ఈజ్ తో చేశారు.

guntur kaaram movie review

త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన కథ మాత్రం రొటీన్ గానే ఉంది. అయితే సినిమాకి ఒక్క విషయం మాత్రం మైనస్ అయింది అంటున్నారు. అదే తమన్ అందించిన సంగీతం. తమన్ పాటలు ఈ మధ్య ఒకటే రకంగా ఉంటున్నాయి. పెద్ద గొప్పగా ఏమీ ఉండట్లేదు. పాటల క్వాలిటీ బాలేదు. సౌండ్ మిక్సింగ్ కూడా అంత వినసొంపుగా లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అన్నీ సినిమాలకి ఒకటే రకంగా ఇస్తున్నారు. ఒక పెద్ద హీరో సినిమాకి ఏ రేంజ్ లో మ్యూజిక్ ఇవ్వాలో ఆ రేంజ్ లో ఇవ్వలేదు.

thaman

ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు. ఇటీవల వచ్చిన చాలా సినిమాల్లో తమన్ పాటలు చాలా రొటీన్ గా అనిపించాయి. ఒక సినిమాకి పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోస్తాయి. అలవైకుంఠపురంలో సినిమా వరకు తమన్ అందించిన పాటలు బాగానే ఉన్నాయి. కానీ ఆ తర్వాత నుండి అన్ని సినిమాలకి ఒకటే రకంగా పాటలు ఇస్తున్నారు. అఖండ సినిమాకి వర్కౌట్ అయ్యింది. కానీ తర్వాత వచ్చిన ఏ సినిమాలకి కూడా ఆ మ్యూజిక్ వర్కౌట్ అవ్వట్లేదు.

S-Thaman-telugu adda

అంతకుముందు తమన్ పాటల్లో ఉన్న క్వాలిటీ ఇప్పుడు లేదు. మరి మార్పు ఎక్కడ వచ్చింది అనేది తమన్ కి మాత్రమే తెలియాలి. కొన్ని పాటలు అయితే మరి అవుట్ డేటెడ్ గా అనిపించాయి. తమన్ జనరల్ గా కాపీ ట్యూన్స్ ఇస్తారు అనే ఒక కామెంట్ ఉంది. ఇప్పుడు పాటలు ఎలా అయిపోయాయి అంటే, తమన్ పాత పాటల నుండి తానే కాపీ చేసి మళ్ళీ కొత్త పాటలు ఇస్తున్నారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏదైనా సరే తమన్ అందించిన మ్యూజిక్ మాత్రం ఈ సినిమాకి మైనస్ అయ్యింది అని అంటున్నారు.


End of Article

You may also like