NTR 30 “దేవర” ఫస్ట్‌లుక్‌లో ఈ ఒక్కటే మైనస్ అయ్యిందా..?

NTR 30 “దేవర” ఫస్ట్‌లుక్‌లో ఈ ఒక్కటే మైనస్ అయ్యిందా..?

by kavitha

ఇటీవల కాలంలో కొత్త సినిమాల పోస్టర్స్, టీజర్ కానీ రిలీజ్ అయితే వాటిని వేరే చిత్రాలతో, వేరే హీరోల పోస్టర్లతో పోల్చి ట్రోల్ చేయడం సోషల్ మీడియాలో కామన్ అయిపోయింది. అయితే ట్రోలింగ్ కి ఎంత పెద్ద హీరో అయినా, ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా ట్రోలింగ్ కి అతీతులు కారని తాజాగా నిరూపితం అయ్యింది.

Video Advertisement

ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ఈ పోస్టర్ కి ఎన్టీఆర్ అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సోషల్ మీడియాలో ఈ పోస్టర్ ను మరో హీరో పోస్టర్ తో పొలుస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ‘దేవర’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయిన విషయమ అందరికి తెలిసిందే. కొరటాల శివ ఈ చిత్ర లాంచ్ ఈవెంట్ లో ఈమూవీ గురించి మరియు ఎన్టీఆర్ పాత్ర గురించి ఎలివేషన్స్ చెప్పారు. అవి విన్న తరువాత అందరు జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీలో మాస్ అవతార్ లో ఉంటారని ఊహించుకున్నారు. లుక్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషించారు. కానీ ఆడియన్స్ లుక్ మామూలుగా ఉందని అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ లుక్ ని ‘వాల్తేరు వీరయ్య’ లో మెగాస్టార్ చిరంజీవి కనిపించే ఫస్ట్ సీన్ లోని షాట్ తో పోలుస్తూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియన్ చిత్రాలను చేస్తూ కూడా కాపీ కొట్టడం ఏంటని డైరెక్టర్  కొరటాలను ట్యాగ్ చేస్తూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇలా దేవర ఫస్ట్ లుక్ పోస్టర్ పై కొంత మంది కాపీ అని, మరి కొంత మంది చాలా హెవీగా ఎడిట్ చేసారని కామెంట్స్ చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది కొమరం భీమ్ సముద్రం దగ్గర నిల్చోని ఉన్నట్టుగా ఉందని, ఆ పాత్రనే కొంచెం మార్చి పోస్టర్ రిలీజ్ చేసారని అంటున్నారు. మంచి రెస్పాన్స్ వచ్చిన కూడా అది కేవలం కొరటాల శివ ఇంత యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నాడు అని ఈ లుక్ తో  తెల్సింది కాబట్టీ పొగిడారు. కానీ అవి అన్నీ పక్కన పెట్టి చూస్తే ప్రేక్షకులకి ఇది అంత పెద్ద కొత్తగా ఏం అనిపించలేదని టాక్.

Also Read: మిగిలిన హీరోలు చేస్తే లేనిది… “మహేష్ బాబు” చేస్తే మాత్రం ఎందుకు వచ్చింది..?


You may also like