మిగిలిన హీరోలు చేస్తే లేనిది… “మహేష్ బాబు” చేస్తే మాత్రం ఎందుకు వచ్చింది..?

మిగిలిన హీరోలు చేస్తే లేనిది… “మహేష్ బాబు” చేస్తే మాత్రం ఎందుకు వచ్చింది..?

by Mohana Priya

Ads

సినిమాల్లో నటించే వాళ్ళకి బయట ఎలాంటి గుర్తింపు ఉంటుందో అందరికీ తెలుసు. సినిమాల్లో నటించే వాళ్ళకి మాత్రమే కాకుండా సెలబ్రిటీ స్టేటస్ ఉన్న ప్రతి వ్యక్తికి బయట ఏదో ఒక రకమైన గుర్తింపు ఉంటుంది. ఆ సెలబ్రిటీ స్టేటస్ తో ఆ వ్యక్తులు కూడా ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. వారికంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంటుంది.

Video Advertisement

వారు ఆ బ్రాండ్ ని ప్రజలకి తెలపాలి అనుకుంటూ ఉంటారు. వ్యాపార రంగంలో ఉన్న ఎంతో మంది కూడా ఈ సెలబ్రిటీల బ్రాండ్ ని వారి పబ్లిసిటీ కోసం, వారి సంస్థ ప్రమోట్ అయ్యేలాగా చేస్తూ ఉంటారు. అలా చాలామంది సెలబ్రిటీలు ఎన్నో ఉత్పత్తులకు పబ్లిసిటీ చేశారు. సెలబ్రిటీ స్టేటస్ ఉన్న స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. మహేష్ బాబు ఇప్పటివరకు ఎన్నో ప్రకటనలలో నటించారు.

Why only Mahesh Babu is getting these comments

మహేష్ బాబు అంతకుముందు బయట ఎక్కువగా కనిపించేవారు కాదు. దాంతో ఫ్యాన్స్ అందరూ కూడా మహేష్ బాబు ఈవెంట్స్ లో కూడా కనిపిస్తే బాగుండు అనుకునేవారు. తర్వాత మెల్లగా సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలకి రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు మహేష్ బాబు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే మహేష్ బాబు జీ తెలుగులో ఇటీవల జరిగిన ఒక డాన్స్ ప్రోగ్రాంకి అతిధిగా వచ్చారు. మహేష్ బాబు జీ తెలుగుతో ఒప్పందం చేసుకున్నారు. భాగంగానే మహేష్ బాబు జీ తెలుగులో ప్రసారం అయ్యే కొన్ని ప్రోగ్రామ్స్ కి అతిథిగా వస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఛానల్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిన కారణంగా మహేష్ బాబు ఈ ఈవెంట్స్ కి వస్తారు. అంతే కాకుండా ఈ ఛానల్ లో ఒక సీరియల్ ప్రోమోలో కూడా మహేష్ బాబు కనిపించారు. దీనిపై చాలా నెగిటివ్ కామెంట్స్ రావడం మొదలయ్యాయి. మహేష్ బాబు అంతకుముందు కూడా జీ తెలుగుకి సంబంధించి ఇలాంటి ఒక ప్రమోషన్ చేశారు. ఆ ప్రమోషన్ వీడియోలో కొన్ని సీరియల్స్ ని ప్రమోట్ చేశారు. ఇప్పుడు కూడా అలాగే చేశారు. అసలు మహేష్ బాబు రేంజ్ ఏంటి ఇలా సీరియల్స్ లో రావడం ఏంటి అని చాలామంది కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.

Why only Mahesh Babu is getting these comments

అయితే స్టార్ హీరోలు ప్రోగ్రామ్స్ కి రావడం కొత్త ఏమీ కాదు. అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమా విడుదల అయిన తర్వాత ఢీ డాన్స్ షోకి అతిథిగా వచ్చారు. ఇంకా చాలామంది హీరోలు కూడా అలాగే డాన్స్ షోలకి, లేదా ఇతర షోలకి అతిథిగా వెళ్లడం జరుగుతూనే ఉంది. అయితే మిగిలిన హీరోలు చేసినప్పుడు లేనిది కేవలం మహేష్ బాబు చేస్తూ ఉంటే ఎందుకు అందరికీ అంత తప్పు చేస్తున్నట్టు అనిపిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అలాగే ఈ హీరోలు అందరూ కూడా వారి బ్రాండ్ తో ఎన్నో ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ ఉంటారు.

Why did Mahesh Babu stay away from remakes

మహేష్ బాబు అలాగే ఒక ఒక ప్రముఖ పాన్ తయారుచేసే కంపెనీకి చెందిన ఉత్పత్తిని ప్రమోట్ చేశారు. అది ఒక ఫ్లేవర్డ్ యాలకులు. అందులో ఎటువంటి హానికర పదార్థాలు ఉండదు. కానీ ఈ విషయాన్ని పక్కన పెట్టి మహేష్ బాబు ఒక సమయంలో బాలీవుడ్ గురించి మాట్లాడినప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొంత మంది నార్త్ ఇండియన్ నెటిజన్లు మహేష్ బాబు పాన్ మసాలా వంటి ఉత్పత్తులను ప్రమోట్ చేశారు అంటూ కామెంట్ చేశారు. అంతేకాకుండా సీరియల్ కి స్టార్ హీరోలు ప్రమోట్ చేయడం తెలుగులో మాత్రమే కొత్త. బాలీవుడ్ లో షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ వంటి పెద్ద పెద్ద స్టార్ హీరోలు ఎన్నో సీరియల్స్ ప్రమోట్ చేశారు.

Why only Mahesh Babu is getting these comments

ఇప్పుడు కూడా వారి సినిమాలు ఏమైనా విడుదల ఉంటే సీరియల్స్ ప్రమోట్ చేయడం మాత్రమే కాకుండా, సీరియల్ లో ఒక ఎపిసోడ్ లో కూడా కనిపిస్తూ ఉంటారు. ఇది తెలుగులో మాత్రమే కొత్త. దాంతో, “మహేష్ బాబు ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. అలాంటి విషయాలకి అభినందించాల్సింది పోయి ఇలా నెగిటివ్ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు” అని అంటున్నారు. అంతేకాకుండా, “షోస్ కి రావడం అంతకుముందు చాలామంది తెలుగు స్టార్ హీరోలు చేశారు కదా? కేవలం మహేష్ బాబుని మాత్రమే ఎందుకు అంటున్నారు?” అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.


End of Article

You may also like