Ads
విజయ్ దేవరకొండ హీరోగా, పరశురామ్ పెట్ల దర్శకత్వంలో వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు గారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. గోపి సుందర్ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ కి ముందు ఒక చిన్న వీడియో విడుదల చేశారు. అందులో ఐరన్ వంచాలా అనే డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత టీజర్ విడుదల చేశారు. హీరో ఒక మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన అబ్బాయి అన్నట్టు చూపిస్తున్నారు. టీజర్ విడుదల అయినప్పుడు నెగిటివ్ కామెంట్స్ బాగా వచ్చాయి. ఇవాళ ట్రైలర్ విడుదల అయ్యింది. ఇప్పుడు కామెంట్స్ ఇంకా ఎక్కువగా వస్తున్నాయి. అసలు ట్రైలర్ లో మైనస్ అయిన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 మిడిల్ క్లాస్ పేరుతో చాలా సినిమాలు వస్తున్నాయి. కానీ దాంట్లో హీరో కానీ, హీరోయిన్ కానీ మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన వాళ్ళలాగా అనిపించట్లేదు. వాళ్ల వస్త్రధారణ, హెయిర్ స్టైల్స్ ఇవన్నీ కూడా స్టైలిష్ గా ఉంటున్నాయి. వాళ్ళు వేసుకునే చెప్పులే టాప్ బ్రాండ్ చెప్పులు ఉంటున్నాయి. అవి ప్రేక్షకులు ఈజీగా కనిపెడుతున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో హీరో ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడు అన్నారు. కేవలం లుంగీ కట్టినంత మాత్రాన మధ్యతరగతి అయినట్టు కాదు కదా. హీరో వేసుకున్న చెప్పుల కాస్ట్ వేలల్లో ఉంటుంది. డ్రెస్సుల ఖరీదు కూడా అంతే ఉంటుంది. కాబట్టి, “పేరుకి మిడిల్ క్లాస్ అని చూపిస్తున్నారు కానీ, మిడిల్ క్లాస్ కనెక్ట్ అయ్యేలాగా ఒక్క అంశం కూడా లేదు” అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
#2 ట్రైలర్ లో సాధారణంగా కథ ఎక్కువగా చూపించరు. “సినిమా స్టోరీ ఏం అయ్యి ఉంటుంది?” అనే ఒక సస్పెన్స్ క్రియేట్ అవ్వడానికి ట్రైలర్ కట్ చేస్తారు. కానీ ఈ సినిమా ట్రైలర్ చూస్తున్నప్పుడు అలాంటి సస్పెన్స్ కనిపించలేదు. సస్పెన్స్ సంగతి పక్కన పెడితే, అసలు ఈ సినిమాలో కథ ఎలా ఉంటుంది అనే ఆసక్తి కూడా క్రియేట్ చేయలేకపోయింది ట్రైలర్. చాలా ప్లెయిన్ గా అలా వెళ్ళిపోయింది. దాంతో ట్రైలర్ కట్ బాగుంటే సినిమా మీద ఆసక్తి పెరిగేది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
#3 సినిమాలో పాత సినిమా రిఫరెన్స్ లు వాడటం ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. సాధారణంగా కొంత మంది హీరోలు తమ పాత సినిమా రిఫరెన్స్ లని ఇప్పుడు వాడుతున్నారు. ఇటీవల గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు ఒక్కడు సినిమా రిఫరెన్స్ వాడారు. ఈ సినిమాలు అన్నీ కూడా 20 సంవత్సరాల క్రితం విడుదలైన సినిమాలు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ ఈ సినిమాలో గీత గోవిందం రిఫరెన్స్ వాడారు. ఇటీవల వచ్చిన రిఫరెన్స్ లు కూడా పెట్టాల్సిన అవసరం ఏంటి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అసలు ఈ సినిమా ట్రైలర్ చూస్తున్నంత సేపు కూడా ఇది గీత గోవిందంకి సీక్వెల్ లాగానే ఉంది అని అంటున్నారు.
#4 సినిమాలో అన్నిటికంటే ముఖ్యమైనది పాత్రలు డిజైన్ చేసిన విధానం. ఒకవేళ పాత్రలు బాగా డిజైన్ చేసినా కూడా, హీరో కానీ, హీరోయిన్ కానీ, లేదా ఇతర పాత్రలు పోషిస్తున్న నటులు కానీ ఆ పాత్రలకి తగ్గట్టు ప్రవర్తించడం అనేది చాలా ముఖ్యం. సినిమాలో వాళ్లు పోషించే పాత్ర కనపడాలి. సినిమాలో ఆ పాత్ర ఎలా మాట్లాడుతుందో, వాళ్లు అలాగే మాట్లాడాలి. కానీ ఈ సినిమాలో, ముఖ్యంగా ట్రైలర్ లో డైలాగ్ డెలివరీ చాలా పెద్ద మైనస్ అయ్యింది. విజయ్ దేవరకొండ డైలాగ్ డెలివరీ మీద కామెంట్స్ వస్తున్నాయి. టోన్ కూడా డిఫరెంట్ గా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సినిమాలో పాత్రకి తగ్గట్టు విజయ్ దేవరకొండ మాట్లాడట్లేదు అని అంటున్నారు.
#5 ట్రైలర్ లో హీరో ఒక డైలాగ్ వాడారు. హీరోయిన్ తనని పొగడలేదు అనే కోపంతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. అది అటు కామెడీగా అనిపించలేదు. ఇటు మామూలుగా కూడా అనిపించలేదు. కాస్త ఇబ్బందికరంగా ఆ డైలాగ్ ఉంది. మరి అది సినిమాలో ఉంటుందో, ఉండదో అనేది తెలియదు. కానీ ట్రైలర్ లో చూసినప్పుడు మాత్రం ఆ డైలాగ్ ఏదో ఒక అవుట్ డేటెడ్ సినిమాలో పెట్టినట్టు అనిపించింది. దాంతో ఆ డైలాగ్ ఎందుకు పెట్టారు అంటు కామెంట్స్ వస్తున్నాయి.
ఇవన్నీ కూడా కేవలం ట్రైలర్ చూసి వస్తున్న కామెంట్స్ మాత్రమే. సినిమా చూశాక ఈ కామెంట్స్ అన్ని పాజిటివ్ కామెంట్స్ గా మారే అవకాశం కూడా ఉంది. అందుకే సినిమా విడుదల అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.
watch trailer :
End of Article