MIRNA MENON IN NAA SAAMIRANGA: “నా సామిరంగ” లో నటించే సెకండ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

MIRNA MENON IN NAA SAAMIRANGA: “నా సామిరంగ” లో నటించే సెకండ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

by Harika

Ads

నాగార్జున తాజా చిత్రం నా సామిరంగా.. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవ్వడం కోసం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన హీరోయిన్ ని చిత్ర యూనిట్ పరిచయం చేసింది. ఆమె మరెవరో కాదు అమిగోస్ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా నటించిన ఆషికా రంగనాథ్. కన్నడలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆషికా రంగనాథ్ కి తెలుగులో రెండవది ఈ సినిమా.

Video Advertisement

నా సామిరంగ సినిమాతో విజయ్ బిన్ని దర్శకుడిగా తెలుగులోకి డెబ్యూ ఇచ్చారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నా సామిరంగ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. కాగా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

తాజాగా మరో క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఆ పోస్టర్ లో ఉన్న హీరోయిన్ మరెవరో కాదు మిర్నా మీనన్.అయితే ఈ సినిమాలో మిర్నా మీనన్ అల్లరి నరేష్ సరసన నటించనుంది. కాగా తాజాగా విడుదల చేసిన ఆ పోస్టర్‌లో మిర్నా మీనన్ చీరకట్టుకుని, పద్ధతిగా బొట్టు పెట్టుకుని, మెడలో మల్లెపూలతో అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా ఎంతో అందగా కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. మిర్నా మీనన్ జైలర్ సినిమాలో రజినీకాంత్ కోడలిగా నటించారు.


End of Article

You may also like