బ్రెజిల్‌లో జరిగిన ఓ అందాల పోటీలో షాకింగ్ సంఘటన జరిగింది. తన భార్య అందాల పోటీలో రెండో స్థానంలో నిలివడంతో ఆమె భర్త వేదికనెక్కి హల్‌చల్‌ చేశాడు. విజేత కిరీటాన్ని లాక్కొని, నేలకేసి కొట్టాడు. దీంతో ఆ కిరీటం ముక్కలు ముక్కలుగా మారింది. బ్రెజిల్‌లో గత శనివారం (27) జరిగిన మిస్ గే మాటో గ్రోస్సో 2023 అందాల పోటీలో ఈ సంఘటన జరిగింది.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Video Advertisement

బ్రెజిల్ లో ప్రతియేటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మిస్ గే మాటో గ్రోసో అందాల పోటీని ఈ ఏడాది కూడా నిర్వహించారు. చాలా మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు.. రౌండ్ల వారీగా జల్లెడ పట్టగా చివరికి నాథల్లీ బెకర్, ఇమాన్యుయెల్లీ బెలిని ఇద్దరు ఫైనలిస్టులుగా నిలిచారు. వారిలో ఒకరి విజేతగా ప్రకటించేందుకు ఒక మహిళ కిరీటంతో వచ్చింది. ప్రేక్షకులు అరుపులతో వారిని ఉత్సాహపరుస్తున్నారు. ఇదే క్రమంలో ఇమాన్యుయెల్లీ బెలిని జడ్జిలు విజేతగా ప్రకటించారు. ఆమెకు కిరీటాన్ని తొడిగేందుకు సిద్ధమయ్యారు.

 

man weird bahavior in miss brasil gay compitition

అయితే రన్నరప్ నాథల్లీ బెకర్ భర్త హఠాత్తుగా వేదిక పైకి వచ్చి కిరీటాన్ని లాక్కొన్నాడు. దానిని నేలకేసి కొట్టి నానా రచ్చ చేశాడు. అక్కడున్న వారిపై కోపంతో అరుస్తూ హడావుడి సృష్టించాడు. తన భార్య విజేత కాలేదనే కోపంతో గందరగోళం చేసాడు. ఈ అనూహ్య ఘటనకు అందరూ షాక్‌కు గురయ్యారు. అనంతరం భార్య నాథల్లీ బెకర్‌ను చేయిపట్టుకుని లాక్కెళ్తూ.. గట్టిగా అరుస్తూ.. మరోసారి కిరీటాన్ని నేలకేసి కొట్టి ముక్కలు చేసాడు సదరు వ్యక్తి. అక్కడున్నవారు వారించినా వినలేదు.

man weird bahavior in miss brasil gay compitition

వెంటనే ఈవెంట్‌ నిర్వాహకులు జోక్యం చేసుకుని సదరు వ్యక్తిని స్టేజ్‌ నుంచి కిందికి పంపేశారు. అతనితో పాటు అతని భార్యను కూడా వెళ్ళిపోయింది. ‘మిస్‌ నాథల్లీ బెకర్ రెండో స్థానంలో నిలవడం న్యాయబద్దమైనదిగా ఆమె భర్త భావించలేదు. అందుకే ఆ విధంగా ప్రవర్తించారు . అతని చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం’ అంటూ పేజెంట్ కోఆర్డినేటర్ మలోన్ హేనిష్ ఓ ప్రకటనలో వెల్లడించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

watch video: