Miss శెట్టి Mr పోలిశెట్టి సెన్సార్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?

Miss శెట్టి Mr పోలిశెట్టి సెన్సార్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?

by Mohana Priya

Ads

టాలీవుడ్ లో అరుంధతిగా, దేవసేనగా …సాలిడ్ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి. ప్రభాస్ లాంటి స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా చేసిన అనుష్క జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.

Video Advertisement

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే క్యాచీ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది.

comments on these scenes in miss shetty mr polishetty trailer

ఇంతవరకు విభిన్నమైన పాత్రలో చూసిన అరుంధతిని మొదటిసారి ఫైవ్ స్టార్ హోటల్ చెఫ్ గా చూడబోతున్నాం మరి..పైగా నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్, పంచ్ మార్క్ డైలాగ్స్…కడుపుబ్బ నవ్విస్తాయి కూడా. అయితే ఈ మూవీలో కామెడీ ఎంత ఉంటుందో కంటెంట్ లో అంత ఆలోచింపచేసే అంశం కూడా ఉంటుందని తెలుస్తోంది.

comments on these scenes in miss shetty mr polishetty trailer

ఈ కామెడీ ఎంటర్టైనర్ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు మహేష్ బాబు పి వహిస్తున్నారు. సెప్టెంబర్ 7న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రచారానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా జోరుగా జరుగుతున్నాయి. సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ‘యు / ఏ’ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది.

memes on miss shetty, mister polishetty movie teaser..!!

అంటే ఈ మూవీ ని కేవలం పెద్దలే కాదు పిల్లలు కూడా చూసి ఆనందించవచ్చు అన్నమాట. సినిమా ఒక మంచి ఎంటర్టైనర్ అని, కామెడీ చాలా బాగుంది అని, ముఖ్యంగా హీరో, హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ చాలా బాగా రూపొందించారు అని అన్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో ఇప్పటి తరం వాళ్ళు ఎదుర్కొనే సమస్యలని కూడా చాలా బాగా చూపించారు అని వార్తలు వచ్చింది.  ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ,టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సెప్టెంబర్ 7న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’తమ కమ్మని మాటల గుమగుమలతో ప్రేక్షకుల కడుపు నింపేలా కామెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి.

ALSO READ : స్కంద ట్రైలర్‌లో రామ్, శ్రీకాంత్ తో పాటు కనిపించిన… ఈ హీరో ఎవరో తెలుసా..?


End of Article

You may also like