ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘స్కంద’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అఖండ విజయం తరువాత బోయపాటి దర్శకత్వం చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Video Advertisement

ఇటీవల ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం బోయపాటి స్టైల్ యాక్షన్‌తో అలరించింది. ఈసారి కూడా రక్తపాతం మామూలుగా ఉండదని బోయపాటి ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చారు. అయితే ఈ ట్రైలర్ హీరో రామ్, శ్రీకాంత్ తో పాటు మరో హీరో కూడా కనిపించారు. ఆయనెవరో ఇప్పుడు చూద్దాం..
రామ్ పోతినేని, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తూన్న మూవీ స్కంద. ఈ మూవీని బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చితాన్ని సెప్టెంబర్ 15న రిలీజ్ చేయనున్నారు. మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం బోయపాటి మార్క్  మాస్ హీరోయిజం, మాస్ డైలాగ్స్ తో నిండిపోయింది. అయితే ఈట్రైలర్‌ లో రామ్, శ్రీకాంత్ లతో పాటుగా ఒకప్పటి హీరో కనిపించారు. ఆయన పేరు దగ్గుబాటి రాజా. హీరోగా తెలుగు మరియు తమిళ భాషలలో పలు సినిమాలలో నటించి, మెప్పించారు. దగ్గుబాటి రామానాయుడు అన్న కుమారుడే దగ్గుబాటి రాజా. అప్పట్లో దగ్గుబాటి రాజా అందమైన హీరోగా పేరు తెచ్చుకున్నాడు. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది.
తెలుగులో కన్నా కోలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలలో నటించాడు. స్టార్ హీరో అవుతాడు అని భావించారు. కానీ రాజాకు హఠాత్తుగా సినిమాలలో అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీని వదిలి, తమ ఫ్యామిలీ వ్యాపారం అయిన గ్రానైట్ బిజినెస్ లో కొనసాగాడు. ఆ మధ్యన వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించాడు. ఇందులో ఎన్టీఆర్ తమ్ముడి పాత్రలో నటించారు. మళ్ళీ స్కంద సినిమాలో కనిపించారు.

Also Read: “థాంక్యూ సుజిత్ అన్నా..!” అంటూ… “పవన్ కళ్యాణ్” OG గ్లింప్స్ పై 15 మీమ్స్..!