“బాలనురా మదనా విరి తూపులు వేయకురా “అనే పాట టివిలో వస్తుంటే ఆ పాటకి 83ఏళ్ల వయసులో ఉన్న నటి జమున గారు డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతుంది. తన పాటకి తనే డ్యాన్స్ చేస్కుంటూ మురిసిపోతున్న వీడియో చూసిన నెటిజన్స్ కూడా మురిసిపోతున్నారు .

Video Advertisement

ఎన్టీయార్, సావిత్రి ప్రధాన నాయకనాయికలుగా నటించిన “మిస్సమ్మ” సినిమాలో నాగేశ్వర్రావుకి జోడిగా నటించారు జమున . పూర్తి హాస్యా భరితంగా నిర్మితమైన ఈ సినిమా అప్పట్లో ఘనవిజయం సాధించింది.  ఆ చిత్రంలో నటించేప్పటికి జమున వయసు 19ఏళ్లు . అరవై ఐదేళ్ల క్రితం వచ్చిన ఆ చిత్రం అప్పట్లో ఒక సంచలనం . పంతొమ్మిదేళ్లప్పుడు ఎలా వేసానో, అప్పటి డ్యాన్స్ లో ఏం పొరపాట్లు ఉన్నాయో వివరిస్తూ చేసిన ఈ డ్యాన్స్ ముచ్చటగొలుపుతుంది . 83 ఏళ్ల వయసులో అలా డ్యాన్స్ వేయడం విశేషమే మరీ..  జమున గారి డ్యాన్స్ చూడండి.. ఎలాకో కరోనా సెలవుల్లో ఉన్నారు కదా..పనిలో పని మిస్సమ్మ సినిమా కూడా చూసేయండి.