Ads
ఆకాశం నీ హద్దురా (సూరరై పోట్రు) సినిమాతో అమెజాన్ ప్రైమ్ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా డబ్బింగ్ సినిమా అయినా, సూర్య సినిమా కాబట్టి, సూర్య ఎన్నో సంవత్సరాల నుండి మన తెలుగు ఇండస్ట్రీలో ఒక భాగం అయిపోయారు కాబట్టి ఇది మన తెలుగు సినిమానే. ఒక నిజ జీవిత కథ ఆధారంగా సుధ కొంగర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నవంబర్ 11 వ తేదీ రాత్రి అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది.
Video Advertisement
ఈ సినిమాకి సూర్య పర్ఫామెన్స్ హైలైట్ గా నిలిచింది. అంతే కాకుండా హీరోయిన్ గా అపర్ణ బాలమురళి, అలాగే ముఖ్య పాత్రల్లో నటించిన ఊర్వశి, పరేష్ రావల్ కూడా చాలా బాగా నటించారు. మోహన్ బాబు కూడా అతిధి పాత్రలో కనిపించారు. డిజిటల్ రిలీజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమాకి దాదాపు అందరూ పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. కానీ సినిమా అన్న తర్వాత ఎక్కడో ఒక చిన్న పొరపాటు జరగడం సహజం. అలా ఈ సినిమాలో కూడా ఒక చిన్న పొరపాటు జరిగింది. అదేంటంటే.
పైన ఉన్న సీన్ లో ఒక అమ్మాయి బుక్ పట్టుకుని కూర్చుంది. అది టాలీవుడ్ అనే ఒక మ్యాగజైన్. ఆ మ్యాగజైన్ మీద రామ్ చరణ్ కవర్ ఫోటో ఉంది. అది రచ్చ సినిమాలోని స్టిల్. ఇదంతా 1997 లో జరిగిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గా మనకు చూపిస్తారు. అంటే ఆ సమయానికి రచ్చ సినిమా రాలేదు సరికదా, అసలు రామ్ చరణ్ ఇండస్ట్రీ లోకి అడుగే పెట్టలేదు.
ఏదేమైనా దీనివల్ల సినిమాకి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వదు. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈ సంవత్సరంలో విడుదలైన బెస్ట్ సినిమాల్లో టాప్ ఫైవ్ జాబితాలో ఆకాశమే నీ హద్దురా సినిమా కచ్చితంగా ఉంటుంది. ఇందాక పైన చెప్పినట్టుగా సినిమా అన్న తర్వాత ఎక్కడో ఒక చోట చిన్న పొరపాటు జరగడం అనేది సహజం. కాబట్టి ఇది పరిగణలోకి తీసుకునే అంత పెద్ద పొరపాటు ఏమీ కాదు. సినిమా చూసినప్పుడు “అరే! ఇది పొరపాటు ఏమో కదా?” అని అనిపిస్తుంది అంతే.
End of Article