Ads
ప్రతి మనిషి పొరపాటు చేయడం అనేది సహజం. దర్శకులు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. వాటిని మనం సినిమా విడుదలైనప్పుడు అంత పట్టించుకోము కానీ, ఎప్పుడైనా తర్వాత మళ్లీ ఆ సినిమా చూసినప్పుడు “అరే ఇది పొరపాటు కదా” అని అనిపిస్తుంది. అలా కొత్త బంగారులోకం సినిమాలో కూడా ఒక చిన్న పొరపాటు ఉంది.
Video Advertisement
సినిమా వచ్చి దాదాపు పదకొండు సంవత్సరాలు అయ్యింది, కానీ పైన చెప్పినట్టుగా ఎప్పుడైనా అంటే అది ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కానీ మళ్లీ సినిమా చూసినప్పుడు మాత్రమే ఇలాంటివి గమనిస్తాం. అయితే ఈ సినిమాలో ఒక సీన్ లో హీరో కి లెటర్ వస్తుంది. ఆ లెటర్ మీద హీరో పేరు పక్కన తను గ్రూప్ పేరు రాసి ఉంటుంది.
లెటర్ మీద మెన్షన్ చేసిన దాని ప్రకారం హీరో గ్రూప్ బైపిసి. తర్వాత అనుకోని కారణాల వల్ల హీరో హీరోయిన్ విడిపోతారు. దాదాపు మళ్లీ నాలుగు సంవత్సరాల తర్వాత హీరో రైల్వే స్టేషన్ కి వెళ్తాడు. అక్కడ ఆహుతి ప్రసాద్ గారికి తను బిటెక్ కంప్లీట్ చేసినట్టు చెప్తాడు. బైపిసి, బి టెక్. జరిగిన పొరపాటు ఏంటో ఈ పాటికే మీకు అర్ధమైపోయి ఉంటుంది.
మనం ఇలా చూస్తే ఈ పొరపాట్ల జాబితాలో చాలా సినిమాలు ఉంటాయి. ఏ సినిమాలో అయినా కూడా ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి కాబట్టి వీటివల్ల సినిమాకి వచ్చే నష్టం ఏమీ లేదు. కాబట్టి ప్రేక్షకులు కూడా వీటిని అంత పెద్దగా పట్టించుకోరు. కానీ ఎప్పుడైనా సినిమా చూసినప్పుడు “అరే! ఇది పొరపాటు ఏమో కదా?” అని అనిపిస్తుంది అంతే.
End of Article