టిల్లు స్క్వేర్ సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా..? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?

టిల్లు స్క్వేర్ సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా..? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?

by Harika

Ads

ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయితే, ఆ తర్వాత అదే సినిమాకి సీక్వెల్ వస్తే దాని మీద అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ఆ అంచనాలు అందుకోవడం చాలా కష్టం. ఒకవేళ అది సక్సెస్ అయితే మాత్రం సినిమాకి తిరుగు ఉండదు. ఇటీవల అలా టిల్లు స్క్వేర్ సినిమాకి జరిగింది. డీజే టిల్లు సినిమా హిట్ అయ్యి చాలా పెద్ద అంచనాలు క్రియేట్ చేసింది. దాంతో దానికి సీక్వెల్ వస్తోంది అంటే కథ ఎలా ఉండబోతోంది అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. మొదటి భాగం టెంప్లేట్ తోనే ఈ సినిమా కూడా నడుస్తుంది.

Video Advertisement

tillu square movie review

అంతే కాకుండా, మొదటి భాగానికి, దీని కథకి సంబంధం లేకుండా తీయలేదు. కొనసాగింపుగానే ఈ సినిమా ఉంది. కాబట్టి టిల్లు అనే ఒక వ్యక్తి జీవితాన్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. అతని జీవితంలో వచ్చే కొత్త కష్టాలు ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాకి మూడవ భాగం కూడా ఉంటుంది అని దాని పేరు టిల్లు క్యూబ్ అని కూడా ప్రకటించారు. అందులో టిల్లు సూపర్ హీరో పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి అని అన్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియదు. అయితే టిల్లు స్క్వేర్ లో ఒక చిన్న పొరపాటు జరిగింది. ఈ సినిమాలో హీరోకి విలన్ పాత్ర పోషించిన వ్యక్తి ఫోన్ చేసి, 27వ తారీకు తన ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది అని, అందుకు టిల్లు డీజే కొట్టాలి అని అడుగుతాడు.

tillu square movie review

అందుకు టిల్లు కూడా సరే అని చెప్తాడు. కానీ ఆ తర్వాత హీరో హీరోయిన్ ని కలవడం, ప్రేమలో పడడం, తర్వాత హీరోయిన్ వచ్చి హీరో వాళ్ళ ఇంట్లో 10 రోజులు ఉండడం, దాదాపు నెల అయిపోతుంది. అప్పుడు మళ్ళీ విలన్ ఫోన్ చేసి, “ఈనెల 27వ తారీకు ఫంక్షన్ ఉందని చెప్పాను కదా?” అని అంటాడు. అప్పటికే నెల దాటిపోతుంది. దాదాపు రెండు నెలలు అయిపోతాయి. కానీ సినిమాలో మాత్రం అదే నెలలో ఇంకా అప్పటికి 27వ తారీకు రానట్టే చూపిస్తారు. కానీ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం సినిమా టైమ్ లైన్ నెలలు గడిచిపోయింది అని తెలిసిపోతుంది. దాంతో ఈ విషయం మీద కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ : ఈ 10 సినిమాల్లో తన తోటి వయసు వారికి “ప్రకాష్ రాజ్” తండ్రిగా నటించారని మీకు తెలుసా.?


End of Article

You may also like