ఈ 10 సినిమాల్లో తన తోటి వయసు వారికి “ప్రకాష్ రాజ్” తండ్రిగా నటించారని మీకు తెలుసా.?

ఈ 10 సినిమాల్లో తన తోటి వయసు వారికి “ప్రకాష్ రాజ్” తండ్రిగా నటించారని మీకు తెలుసా.?

by Mohana Priya

ఇండస్ట్రీలో ఉన్న నటుల్లో ఏ పాత్ర అయినా పోషించగల నటులలో ప్రకాష్ రాజ్ ఒకరు. తన వయసుకు మించిన పాత్ర అయినా, వయసుకి తగ్గ పాత్ర అయినా, తన వయసు కంటే చిన్న వయసు ఉన్న పాత్ర అయినా ఒకటే రకమైన ఈజ్ తో పర్ఫార్మ్ చేస్తారు ప్రకాష్ రాజ్.

Video Advertisement

సినిమాల్లో బిజీగా ఉన్న ప్రకాష్ రాజ్ ఇంకొక పక్క తన పొలిటికల్ కెరియర్ కూడా హ్యాండిల్ చేస్తున్నారు. తనకు ఏదైనా కరెక్ట్ కాదు అనిపిస్తే ఎవరికి భయపడకుండా తను అనుకున్నది సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తారు ప్రకాష్ రాజ్.

ప్రకాష్ రాజ్ వయసు 55 సంవత్సరాలు. కానీ ఇందాక పైన చెప్పినట్టుగా ప్రకాష్ రాజ్ దగ్గర దగ్గర తన వయసు ఉన్న వారికి, లేదా తనకంటే కొంచెం తక్కువ వయస్సు ఉన్న వారికి తండ్రి పాత్రలో నటించారు. అలా నటించిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

#1 అంతపురం

ఈ సినిమాలో సాయి కుమార్ కి తండ్రి పాత్రలో నటించారు ప్రకాష్ రాజ్. సాయి కుమార్ వయస్సు 59 సంవత్సరాలు.

#2 ప్రేమకు వేళాయరా

ఈ సినిమాలో సౌందర్యకి తండ్రి గా నటించారు ప్రకాష్ రాజ్. సౌందర్య వయసు ఇప్పుడు 48 సంవత్సరాలు.

#3 అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి

ఈ సినిమాలో రవి తేజకి తండ్రిగా నటించారు. రవితేజ వయస్సు 52 సంవత్సరాలు. అలాగే బలుపు సినిమాలో కూడా రవితేజ తండ్రిగా నటించారు ప్రకాష్ రాజ్.

#4 నువ్వొస్తానంటే నేనొద్దంటానా

ఇందులో, ఇంకా బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం లో ప్రకాష్ రాజ్ సిద్ధార్థ్ కి తండ్రిగా నటించారు. సిద్ధార్థ్ వయసు 41 సంవత్సరాలు.

#5 ఇంద్ర

ఈ సినిమాలో సోనాలి బింద్రే కి తండ్రిగా నటించారు. సోనాలి బింద్రే వయసు 45 సంవత్సరాలు.

#6 అర్జున్

ఈ సినిమాలో రాజా కి తండ్రిగా నటించారు. రాజా వయస్సు 41 సంవత్సరాలు.

#7 చూడాలని ఉంది

ఈ సినిమాలో అంజలా జవేరి కి తండ్రి పాత్రలో నటించారు. అంజలా జవేరి వయసు 48 సంవత్సరాలు.

#8 దూకుడు

దూకుడు లో మహేష్ బాబు కి తండ్రి పాత్రలో నటించారు ప్రకాష్ రాజ్. ఈ సినిమాలో మాత్రమే కాకుండా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహర్షి సినిమాల్లో కూడా మహేష్ బాబు కి తండ్రిగా నటించారు. మహేష్ బాబు వయసు 45 సంవత్సరాలు.

#9 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

ఈ సినిమాలో వెంకటేష్ కి, మహేష్ బాబు కి తండ్రి గా నటించారు ప్రకాష్ రాజ్. వెంకటేష్ వయసు 59 సంవత్సరాలు.

#10 శతమానం భవతి

ఈ సినిమాలో షిజు కి, ఇంద్రజ కి తండ్రిగా, శర్వానంద్ కి తాతగా నటించారు ప్రకాష్ రాజ్. షిజు వయసు 46 సంవత్సరాలు, ఇంద్రజ వయసు 42 సంవత్సరాలు.


You may also like

Leave a Comment