Ads
ఈ మధ్య కాలంలో పెళ్లి చూపులలో మార్పులు ఎక్కువగా వచ్చాయి. ఇది వరకు అయితే కుటుంబ సమేతంగా పెళ్లి చూపులకి వెళ్లేవారు. కానీ ఎన్నో మార్పులు వచ్చాయి. కేవలం పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మాట్లాడుకోవడం లేదంటే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుల తల్లిదండ్రులు కూర్చుని మాట్లాడుకోవడం మాత్రమే జరుగుతోంది.
Video Advertisement
ఇది వరకు అయితే ఇంట్లో ఉండే వాళ్ళు బంధువులు అందరూ కలిసి వెళ్లేవారు. మంచి, చెడు చూసి చెప్పేవారు. ఆ తర్వాత వివాహాలను నిశ్చయించేవారు.
పైగా ఇంకొక మార్పు ఏమిటంటే ఇది వరకు పెళ్లి చూపులు ఇళ్ళల్లో జరిగేవి ఇప్పుడైతే హోటల్స్ లో జరుపుతున్నారు ఇలా పెళ్లి చూపుల్లో చాలా మార్పులు వచ్చాయి.
అసలు పెళ్లి చూపుల్లో చూడాల్సినవి ఇవి:
#1. ఇరు కుటుంబాలు ఎలా వున్నాయి. ఇంట్లో ఎవరుంటారు, కుటుంబం మంచిదా కాదా అనేది ముఖ్యం.
#2. ఒకే కులంలో పెళ్లిళ్లు చేస్తున్నటైతే గోత్రం, శాఖ వంటివి చూడాలి.
#3. అబ్బాయి లేదా అమ్మాయి మంచివాళ్లేనా అనేది చూడాలి.
#4. అబ్బాయి ఏం చదువుకున్నాడు, ఏం ఉద్యోగం చేస్తున్నాడు అనేది కూడా చూడాలి. ఇప్పుడు అమ్మాయి చదువు, ఉద్యోగం కూడా చూస్తున్నారు.
#5. సేవింగ్స్ గురించి కచ్చితంగా వుండాలి.
#6. కమిట్మెంట్స్ గురించి కూడా అడగాలి. పెళ్లి చూపుల్లో ఇది అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా దీని గురించి చెప్పుకోవాలి.
#7. అలవాట్ల గురించి నిజాలు చెప్పాలి. ఎప్పుడు కూడా అలవాట్ల విషయంలో నిజాయతీగా వుండాలి. ఇది కూడా పెళ్లి చూపుల సమయంలో చెప్పుకోవాలి.
#8. ఖచ్చితం జాబ్ ప్రొఫైల్ ని చూడాలి. జాబ్ ఏం చేస్తున్నారు అనేది చూడాలి. అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరి విషయంలో కూడా ఇవి అవసరం.
#9. వంశపార్యంగా వచ్చే ఆస్తులు, అనారోగ్య సమస్యల గురించి కూడా అడిగి తెలుసుకోవడం మంచిది.
#10. వ్యసనాలను కూడా తెలుసుకోవాలి. వ్యసనాలను అడగకుండా పెళ్లి చేసుకోకూడదు. ఈ విషయంపై తల్లిదండ్రులు ఓపెన్ గా మాట్లాడితే మంచిది. కచ్చితంగా వివరంగా దీని గురించి మాట్లాడుకోవాలి.
#11. రిలేషన్ షిప్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. పెళ్లి అయ్యాక దానికి కట్టుబడి ఉండడం ఎంతో అవసరం. అలా లేని వాళ్లు పెళ్లి చేసుకోక పోవడమే మంచిది. బాధ్యతతో ప్రవర్తిస్తూ వుండాలి. బాధ్య లేక పోతే వైవాహిక జీవితంలో సమస్యలే ఉంటాయి. మరొకరితో రిలేషన్ షిప్స్ ని పెట్టుకుని చాలా మంది అనవసరంగా జీవిత భాగస్వామిని బాధ పెడుతూ ఉంటారు అందుకనే ముందే దీని గురించి తెలుసుకుని పెళ్లికి ఒప్పుకోవడం మంచిది.
చాలా మంది ఉద్యోగం వచ్చేసింది కదా పెళ్లి చేసుకోవాలి అని తొందరలో ఇటువంటి విషయాలను పట్టించుకోకుండా ముందడుగు వేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏడు అడుగులు వేశాక చిక్కులే తప్ప ఆనందం ఉండదు కనుక పెళ్లి చేసుకోవాలని అనుకునే స్త్రీలైనా పురుషులైనా వీటిని పరిగణనలోకి తీసుకుని నడుచుకుంటే మంచిది.
End of Article