దృశ్యం2 సినిమాలో ఈ 13 పొరపాట్లని గమనించారా..? సినిమా చూస్తున్నప్పుడు మనకి కనిపించలేదు కదా…?

దృశ్యం2 సినిమాలో ఈ 13 పొరపాట్లని గమనించారా..? సినిమా చూస్తున్నప్పుడు మనకి కనిపించలేదు కదా…?

by Mohana Priya

Ads

వెంకటేష్ హీరోగా ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన సినిమా దృశ్యం 2. ఈ సినిమా 2014లో విడుదలైన దృశ్యం సీక్వెల్. మలయాళ సినిమా దృశ్యంకి రీమేక్‌గా ఈ సినిమా రూపొందించారు.

Video Advertisement

ఈ తెలుగు సీక్వెల్‌కి కూడా మలయాళం సినిమాకి దర్శకత్వం వహించిన జీతు జోసెఫ్ దర్శకత్వం వహించారు. దృశ్యం సినిమా మొదటి భాగానికి కొనసగింపుగానే మొదలవుతుంది. ఆ సంఘటన జరిగిన 6 సంవత్సరాల తర్వాత మళ్లీ రాంబాబు కుటుంబం ఎలాంటి సంఘటనలు ఎదుర్కుంది అనే విషయం చుట్టూ సినిమా నడిస్తుంది.

mistakes in drushyam 2 movie

మొదటి భాగాన్ని, రెండవ భాగాన్ని పోల్చి చూస్తే, రెండవ పార్ట్ లో సస్పెన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సినిమా చాలా మామూలుగా మొదలవుతుంది. అసలు ఏం జరుగుతోంది అనేది కొంత సమయం వరకు అర్థం కాదు. కానీ సినిమా ముందుకు వెళుతున్న కొద్దీ సస్పెన్స్ మొదలవుతుంది. ఎప్పుడైతే సినిమాలోని అసలు పాయింట్ తెరపై చూపించారో, అప్పటినుండి కథ అంతా ఆసక్తికరంగా సాగుతుంది.

mistakes in drushyam 2 movie

ఈ సినిమా థియేటర్లలో విడుదల చేద్దామని అనుకున్నా కూడా, కరోనా ఇంకా పూర్తిగా తగ్గని కారణంగా ఓటీటీలో విడుదల చేయాలని సినిమా బృందం నిర్ణయించుకున్నారు. ఈ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్‌లో హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే, ప్రతి సినిమాలో కొన్ని పొరపాట్లు జరగడం అనేది సహజం. అలాగే దృశ్యం 2 సినిమాలో కూడా కొన్ని పొరపాట్లు జరిగాయి. కానీ వాటివల్ల సినిమాపై ఎటువంటి ప్రభావం పడలేదు. దృశ్యం 2 సినిమాలో జరిగిన పొరపాట్లు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

watch video : 

https://youtu.be/aUvNuDFBT0o


End of Article

You may also like