• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

వైరల్ వీడియో: చీర కట్టి క్రికెట్ ఆడిన మిథాలీ రాజ్..! కారణం ఇదే…!

Published on March 6, 2020 by Anudeep

మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లు అన్నింటా అవకాశాలు అందిపుచ్చుకుంటునప్పటికి , తమని తాము నిరూపించుకుంటున్నప్పటికి  మహిళల పట్ల చిన్నచూపు అనేది ఇంకా ఉంది  .  అటువంటి వాటన్నింటికి చెక్ పెడుతూ మహిళలు అన్నింటా రానించగలరనే దానికి నిదర్శనంగా , కట్టుబాట్లను ఎదిరించి ముందుకు వెళ్తున్నారని చెప్పడానికి చీరకట్టుకుని క్రికెట్ ఆడి చూపించింది మిధాలిరాజ్.

మిధాలీ రాజ్ , ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. మహిళా క్రికెట్ టీంను ఒక స్థాయిలో నిలబెట్టడానికి  క్రికెట్ టీం కెప్టెన్ గా, ప్లేయర్ గా మిధాలి చేసిన కృషి మరువలేనిది . క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికి , పరోక్షంగా ప్లేయర్స్ లో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి ఎప్పటికప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం చీరకట్టుతో క్రికెట్ ఆడిన మిధాలి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతుంది .

మహిళా క్రికెట్ టీంలో లేడీ సచిన్ గా పేరుగాంచిన మిధాలిది 20ఏళ్ల సుదీర్ఘమైన కెరీర్. ఇన్నేళ్ల కెరీర్లో అర్జున అవార్డు, ఖేల్ రత్న మరియు పద్మశ్రీలను సొంతం చేసుకుంది. విమెన్ క్రికెట్ కి ఎలాంటి ప్రాధాన్యత లేని రోజుల నుంచి ఇప్పుడు మెన్స్ క్రికెట్ తో సమానమైన గుర్తింపు తీసుకొచ్చే వరకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. మహిళా క్రికెట్ టీంని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది.

రెండు రోజుల్లో అంతర్జాతియ మహిళా దినోత్సవం ఉంది , అదేరోజున టి20 ఫైనల్ ఉంది. తొలిసారిగా భారత మహిళల జట్టు ఫైనల్ కి చేరుకున్న విషయం తెలిసిందే . ఫైనల్స్ లో ఆస్ట్రేలియాతో తలపడనున్న టీం ఇండియాను ఎంకరేజ్ చేస్తూ , కట్టుబాట్లు తెంచుకుని అమ్మాయిలు అన్నింట్లో ఎదుగుతున్నారనడానికి నిదర్శనంగా చీరకట్టులో క్రికెట్ ఆడింది మిధాలి .సిటీ గ్రూప్‌తో కలిసి ఓ ప్రత్యేక వీడియోను రూపొందించి, ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది “కమాన్‌ టీమిండియా, ప్రపంచకప్‌ను తీసుకురండి” అంటూ పేర్కొంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.చాలా మంది నెటిజన్లు మిథాలీని చూస్తే గర్వంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇదిలా ఉంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే టీం ఇండియా, ఆస్ట్రేలియాతో ఫైనల్ లో పోటీ పడబోతుంది. ఇక ఉమెన్స్ ప్రపంచ కప్ గెలిస్తే పురుషులకి వచ్చిన స్థాయిలో గుర్తింపు రాకున్న కూడా వారిని కూడా బీసీసీఐ ఖచ్చితంగా గుర్తించే అవకాశం ఉంది. దాంతో పాటు క్రికెట్ ని కెరియర్ గా ఎంచుకోవాలని ప్రయత్నం చేసే మహిళలకి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది .

watch video:

@M_Raj03 you’re a true inspiration for living life #OnYourTerms and breaking the stereotype! Still mithali mam is way too awesome

#MithaliPlaysCricketInSaree pic.twitter.com/wuvVlDZWfP

— Salik Zafar (@salikzafar_) March 5, 2020


We are hiring Content Writers. Click Here to Apply



Search

Recent Posts

  • భార్య భర్తల బంధం బలంగా ఉండాలంటే అసలు చేయకూడని పనులు ఇవే… తెలిసిన చాణక్య నీతి ఇదే.
  • బ్లేడ్ ను ఈ డిజైన్ లోనే ఎందుకు తయారు చేసారు..? దీనిని ఎవరు తయారు చేసారో తెలుసా?
  • చెప్పవే చిరుగాలి లో హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడెలా మారిపోయిందో చూడండి..!
  • “పుష్ప”లోని ఈ డైలాగ్… అంతకుముందే “వేణు మాధవ్” చెప్పారా..? ఎక్కడంటే..?
  • అతిలోక సుందరి ‘శ్రీదేవిని’ పెళ్లి చేసుకోవాలనుకున్న మన తెలుగు హీరోలు ఎవరో తెలుసా ? ఎందుకు ఆగిపోయారంటే ?

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions