Ads
కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. పటాన్‌చెరు ఓఆర్‌ఆర్ మీద జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందడం తెలంగాణలో సంచలనంగా మారింది. ఆమె మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
Video Advertisement
లాస్య నందిత కుంటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురు నాయకులు సానుభూతిని తెలియజేశారు. అయితే ఆమెకు గత రెండునెలలో ఇది మూడవ యాక్సిడెంట్ అని తెలుస్తోంది.
ఎమ్మెల్యే లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ జరుగగా, అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆమె రీసెంట్ గా వరుసగా ప్రమాదాలకు గురయ్యారు. ఆమెను మృత్యువు వెంటాడుతోందా అన్న విధంగా వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 2నెలల క్రితం సికింద్రాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే లాస్య నందిత వెళ్ళిన సమయంలో ఆమె ఎక్కిన లిఫ్ట్ సడెన్‌గా కిందకి వెళ్ళింది. దాంతో ఆమె లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. ఆమె వ్యక్తిగత సిబ్బంది అప్రమత్తమై లిఫ్ట్ తలుపులు బద్దలు కొట్టి, ఆమెను సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే అయిన తారువాత ఆమెకు అలా మెుదటిసారి ప్రమాదం జరిగింది.
ఆ తర్వాత 10 రోజుల (ఫిబ్రవరి 13) క్రితం బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నల్గొండలో నిర్వహించింది. ఆ సభకు వెళ్ళి, తిరిగి వస్తున్న సమయంలో లాస్య నందిత కారు నార్కట్‌పల్లి దగ్గర అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్ ఢీ కొట్టింది. ఈ యాక్సిడెంట్ హోంగార్డు మృతి చెందగా, లాస్య నందితకు స్వల్పగాయాలు అయ్యాయి. నేడు జరిగిన మూడవ ప్రమాదంలో లాస్య నందిత ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పటి దాకా కారు రెయిలింగ్‌ను ఢీకొట్టడం వల్ల యాక్సిడెంట్ జరిగిందని అందరు భావిస్తున్నారు. తాజాగా పోలీసులు కారును పరిశీలించి, రెయిలింగ్‌ను ఢీకొనడం వల్లే ఇంత పెద్ద యాక్సిడెంట్ జరగలేదని, రెయిలింగ్‌తో పాటు, లాస్య నందిత కారు ముందున్న లారీని కూడా ఢీ కొట్టినట్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
అతివేగంగా వస్తున్న కారు ముందున్న లారీని ఢీకొట్టినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయి. కారు బ్యానెట్ పై పార్ట్ పూర్తిగా ధ్వంసం అయ్యింది. అలాగే కారుకు ఎడమవైపు ముందు చక్రం కూడా పూర్తిగా ధ్వంసమైంది. అంతేకాకుండా మీటర్ బోర్డ్ 100 కి.మీ.. స్పీడ్ దగ్గర ఆగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఔటర్ రింగ్ రోడ్ రెయిలింగ్‌ను కారు ఢీ కొడితే ఇంత పెద్ద యాక్సిడెంట్ జరగకపోవచ్చని నిపుణులు కూడా అంటున్నారు.
Also read: నేను చేసిన తప్పు ఇలా అవుతుందనుకోలేదు…10 రోజులుగా హాస్పిటల్ లో నరకం చూస్తున్నా అంటూ ప్రియాంక సింగ్.!
End of Article