గర్భిణి కష్టం తెలుసుకుని నిమిషాల్లో తీర్చిన ఎమ్మెల్యే…భర్త వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టేసరికి!

గర్భిణి కష్టం తెలుసుకుని నిమిషాల్లో తీర్చిన ఎమ్మెల్యే…భర్త వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టేసరికి!

by Anudeep

కరోనాతో ప్రపంచం మొత్తం గడగడలాడుతుంటే, కేరళలో మాత్రం కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అక్కడ  ప్రభుత్వం ప్రజలకోసం తీసుకుంటున్న చర్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.లాక్ డౌన్ వేళ ప్రజలు ఇబ్బంది పడకుండా ఎక్కడిక్కడ చర్యలు చేపడుతూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. తాజాగా ఒక గర్భిణి కష్టాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే సత్వరమే తనకు సాయం చేయడంతో సోషల్ మీడియలో వైరల్ గా మారింది..

Video Advertisement

అనారోగ్యంగా ఉందని,చెకప్ చేయించుకుందామని ఒక గర్బవతి తన భర్తతో కలిసి దగ్గరలోని హాస్పిటల్ కు వెళ్లింది..ఆమెకి రక్తస్రావం అవుతుందని గుర్తించిన డాక్టర్, బరువులు మోయడం లాంటి పనులు ఏమైనా చేస్తున్నావా? అని ప్రశ్నించారు. అయితే తమ ఇంట్లో నీటి కొరత ఉందని, అందుకే కొండ కింద ఉన్న చుట్టాల ఇంటికి వచ్చిన నీళ్లు నింపుకొని మళ్లీ కొండపైన ఉన్న తమ ఇంటికి తీసుకువెళ్తున్నానని ఆ మహిళ చెప్పింది. దీంతో డాక్టర్లు వెంటనే ఆమెను ఆ పనులు మానేయాలని,లేదంటే ఆరోగ్యానికి ప్రమాదం అని సూచించారు.  ట్రీట్మెంట్  పూర్తైన ఇంటికి వచ్చేసరికి అక్కడ జరుగుతున్న సంఘటన చూసి ఆశ్చర్యపోయారు.

భార్యభర్తలు ఇంటికి వచ్చేసరికి  అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని వాళ్ల ట్యాంకును నీటితో నింపుతున్నారు. ‘అమ్మాయుమ్ అండ్ కుంజుమ్’ అనే వాట్సాప్ గ్రూప్‌లో గర్భిణి భర్త ఓ మెసేజ్‌ పెట్టాడు. తన భార్య పడుతున్న కష్టాన్ని వివరిస్తూ రాసిన ఆ పోస్టు ఎమ్మెల్యే వీణా జార్జ్‌ వరకు చేరింది. దీంతో ఎమ్మెల్యే  వెంటనే ఆ నెంబర్‌కి ఫోన్ చేసారు. తన భార్య కష్టాన్ని అతను వివరించాడు. వెంటనే ఇంట్లో ఉంటున్న వారికి ఫోన్ చేసి వారికి ఎటువంటి సహాయం కావాలో అడిగి తెలుసుకున్నారు. పతనంతిట్ట అగ్నిమాపక డిపార్ట్మెంట్ ఆఫిసర్ వినోద్ కుమార్‌కి కాల్ చేసి వారికి నీటిని అందించడం కుదురుతుంతా అని అడిగారు, దానికి సమాధానంగా ఆ పని చేయడం వీలవుతుంది అని, ఆ సాయం చేయడం మాకు సంతోషం అని వినోధ్ సమాధానం ఇచ్చారు.

 

ఎమ్మెల్యే కాల్ చేసిన అరగంటలో సదరు గర్భిణి ఇంటి వద్దకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నీటితో వాళ్ల ఇంటి ట్యాంకును నింపేశారు. గర్భిణి ఇంటికి చేరుకొనే సరికే ఈ పనులు అన్నీ పూర్తయ్యాయి. సోషల్ మీడియాలో వైరలైన ఈ వార్తతో నెటిజన్లు ఎమ్మెల్యే వీణాజార్జ్ పై, అగ్నిమాపక సిబ్బందిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


You may also like