ఎమ్మెల్సీ “కల్వకుంట్ల కవిత” భర్త ఏ ఉద్యోగం చేస్తారో తెలుసా..? ఆయన బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

ఎమ్మెల్సీ “కల్వకుంట్ల కవిత” భర్త ఏ ఉద్యోగం చేస్తారో తెలుసా..? ఆయన బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

by Mounika Singaluri

Ads

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొద్ది రోజుల క్రితం అరెస్ట్ అయ్యారు. దాంతో ఎన్నికలకు ముందు పార్టీకి ఊహించనటువంటి సంఘటన జరిగింది. నిన్న ఈడీ అధికారులు కవితని అదుపులోకి తీసుకున్నారు. ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి, కవితని అరెస్ట్ చేశారు. దాంతో, బీఆర్ఎస్ పార్టీ నేతలు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Video Advertisement

kalvakuntla kavitha husband devanapally anil kumar

అలా హఠాత్తుగా తనిఖీ చేసి ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంక కవిత విషయానికి వస్తే, కల్వకుంట్ల కవిత మార్చి 13వ తేదీన 1978 లో జన్మించారు. కవిత కరీంనగర్ లో జన్మించారు. కవిత విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో కవిత డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ సదరన్ మిస్సిసిపిలో మాస్టర్ ఆఫ్ సైన్సెస్ అభ్యసించారు. యూఎస్ఏ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసిన తర్వాత, 2006 లో కవిత భారతదేశానికి తిరిగి వచ్చేసారు.

kalvakuntla kavitha husband devanapally anil kumar

2003 లో కవితకి, దేవనపల్లి అనిల్ కుమార్ తో పెళ్లి జరిగింది. వారికి ఆదిత్య, ఆర్య అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. దేవనపల్లి అనిల్ కుమార్ ఒక వ్యాపారవేత్త. ఎన్నో వ్యాపారాల్లో రాణిస్తున్నారు. దేవనపల్లి అనిల్ కుమార్ ఆస్యపట్రా ఇన్వెంచర్స్, రెలిక్సిర్ ఫార్మాషూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో భాగస్వామిగా ఉన్నారు. ఫార్మా కంపెనీ అయిన రెలిక్సిర్ కి ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు. వారిలో అనిల్ కుమార్ లాంగెస్ట్ సర్వింగ్ బోర్డ్ మెంబర్ గా వ్యవహరిస్తున్నారు.

kalvakuntla kavitha husband devanapally anil kumar

ఈ కంపెనీ మరి కొన్ని కంపెనీలతో టై-అప్ అయ్యి ఉంది. 2003 లో కవిత, అనిల్ కుమార్ పెళ్లి చేసుకొని యూఎస్ కి వెళ్లిపోయారు. తర్వాత 2006 లో కవిత ఇండియాకి తిరిగి వచ్చేసారు. ఆ తర్వాత నుండి ఇక్కడే ఉంటున్నారు. అనిల్ కుమార్ కూడా అప్పుడప్పుడు కవితతో కలిసి బయట కనిపిస్తూ ఉంటారు. రాజకీయ కార్యకలాపాల్లో పెద్దగా పాల్గొనకపోయినా కూడా సాధారణంగా ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు బయటికి వస్తూ ఉంటారు.


End of Article

You may also like